AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

45 రోజులు.. 3 దేశాలకు దడ.. కట్‌చేస్తే.. కొత్త కెప్టెన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే షాక్

Pakistan Cricket Team: వచ్చే ఏడాది ఫిబ్రవరి - మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్ 45 రోజుల్లో ఏం చేసిందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే అని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇందుకు గల కారణం పాకిస్తాన్ కెప్టెన్ రిజ్వాన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

45 రోజులు.. 3 దేశాలకు దడ.. కట్‌చేస్తే.. కొత్త కెప్టెన్‌తో ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే షాక్
Pakistan Team
Venkata Chari
|

Updated on: Dec 20, 2024 | 11:51 AM

Share

Pakistan Cricket Team: ఓవైపు ఛాంపియన్స్ ట్రోఫీ 2025 హాడావుడి సాగుతుంతే.. మరోవైపు, పాకిస్తాన్ జట్టు క్రికెట్ మైదానంలో కొత్త చరిత్రను లిఖించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం ఐసీసీ హైబ్రిడ్ మోడల్‌ను ఆమోదించిన రోజు, పాకిస్తాన్ కూడా వన్డే క్రికెట్ మైదానంలో గెలిచిన మూడవ దేశంగా అవతరించింది. సౌతాఫ్రికాను స్వదేశంలో జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో ఓడించడం ద్వారా పాక్ జట్టు ఈ విజయాన్ని సాధించింది. దక్షిణాఫ్రికాకు ముందు, పాకిస్తాన్ స్వదేశంలో ఆస్ట్రేలియాపై గెలిచింది. ఆ తర్వాత స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌లో జింబాబ్వేను ఓడించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ముందు కేవలం 45 రోజుల్లో మూడు దేశాలను మట్టికరిపించింది.

కెప్టెన్‌గా రిజ్వాన్.. 45 రోజుల్లో 3 దేశాలపై గెలుపు..

సింపుల్ గా చెప్పాలంటే 45 రోజుల్లో 3 దేశాల్లో పాకిస్థాన్ తన విజయగాథను లిఖించింది. మహ్మద్ రిజ్వాన్ అనే ఒకే ఒక్క కెప్టెన్ నాయకత్వంలో పాక్ జట్టు 3 దేశాలలో విజయం సాధించింది. అక్టోబర్ చివరిలో రిజ్వాన్‌కు పాకిస్థాన్ వైట్ బాల్ జట్టు కెప్టెన్సీని అప్పగించారు. దీంతో ఫలితం అందరి ముందు కనిపిస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ప్రత్యర్థులందరి కళ్లు తెరిపించిన పాక్ జట్టు ఇప్పటి వరకు జైత్రయాత్ర చేస్తోంది.

నవంబర్ 4, డిసెంబర్ 19 మధ్య అద్భుత విజయాలు..

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ఆ 45 రోజుల్లో పాకిస్తాన్ ఏం చేసిందనే విషయం తెలుసుకోవాలి. ఆ రోజు 4 నవంబర్ 2024 నుంచి ప్రారంభమైంది. అయితే, 45 రోజుల వ్యవధి 19 డిసెంబర్ 2024న పూర్తయింది. ఈ 45 రోజుల్లో, మహ్మద్ రిజ్వాన్ ఆస్ట్రేలియాతో పాటు దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్‌ను గెలుచుకున్న పాకిస్తాన్‌కు మొదటి కెప్టెన్‌గా నిలిచాడు.

ఇవి కూడా చదవండి

3 దేశాలపై జైత్రయాత్ర..!

నవంబర్ 4 నుంచి ఆస్ట్రేలియాతో పాకిస్తాన్ మొదట 3-వన్డేల సిరీస్‌ను ఆడింది. అది 2-1 తేడాతో గెలిచింది. ఆ తర్వాత నవంబర్ 24 నుంచి జింబాబ్వేతో 3 వన్డేల సిరీస్‌ను ఆడగా, ఇక్కడ కూడా 2-1తో గెలిచింది. ఆ తర్వాత, డిసెంబర్ 17 నుంచి దక్షిణాఫ్రికాతో ప్రారంభమయ్యే 3-వన్డేల సిరీస్‌లో పాకిస్తాన్ 2-0 ఆధిక్యంలో ఉంది. అంటే, సిరీస్‌ని కైవసం చేసుకుంది. డిసెంబర్ 19న దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో పాకిస్థాన్ 81 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..