Andhra News: ఇదేంది సామీ.. చేసేదంతా మీరు.. శిక్షేమో నాకా..?
కోడిపందాలు ఆడకూడదని పోలీసులు చెబుతున్నప్పటికీ నిత్యం దొంగచాటుగా కోడిపందాలను పందెం రాయుళ్ళు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఒక్క చోట కోడిపందాలు ఆడిన పందెం రాయళ్లను పోలీసులు పట్టుకున్నారు. అయితే ఇక్కడ పందెం నిర్వహించే వాళ్లకి నోటీసులు ఇచ్చి పంపారు. పందెంలో పాల్గొన్న కోడిని మాత్రం ఖైదీ చేయడం అందర్నీ ఆశ్చరానికి గురిచేసింది.
సంక్రాంతి వస్తుందంటే చాలు పందెం రాయుళ్ళు రెడీగా ఉంటారు. అందులో కోడిపందాలు వేసేవారు మరీ జోరు మీద ఉంటారు. అయితే కోడిపందాలు ఆడకూడదని పోలీసులు చెబుతున్నప్పటికీ నిత్యం దొంగచాటుగా కోడిపందాలను పందెం రాయుళ్ళు నిర్వహిస్తూనే ఉన్నారు. పోలీసుల దాడులలో పందెం నిర్వహించే వాళ్ళను పట్టుకుంటారు వారికి తగిన శిక్షలు వేసి వదిలేస్తారు. అయితే ఇక్కడ పందెం నిర్వహించే వాళ్లకి నోటీసులు ఇచ్చి పంపారు. పందెంలో పాల్గొన్న కోడిని మాత్రం ఖైదీ చేశారు.
కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండలంలోని దుగనపల్లె గ్రామ సమీపంలో కొంతమంది జూదం ప్రియులు జూదం ఆడుతూ కోడిపందెం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రదేశంలో జూదం ఆడుతున్న వారిపై దాడులు నిర్వహించారు. ఆ సమయంలో వారికి కొంత నగదుతో పాటు జూదమాడుతున్న వారు పట్టుబడ్డారు. అయితే వారితో పాటు ఒక కోడి పుంజు కూడా అక్కడ పట్టుబడింది. అందరినీ అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తీసుకువెళ్లిన పోలీసులు కోడిపందెం, జూదమాడుతున్న వారికి 41 నోటీసులు ఇచ్చి పంపించి వేసి.. నగదును సీజ్ చేశారు. కానీ వారితో వచ్చిన కోడి పుంజును మాత్రం వారు వెనక్కి పంపలేదు. ఆ కోడిని అరెస్ట్ చేసి కటకటాల పాలు చేశారు పోలీస్ స్టేషన్లోని లాకప్‌లో కోడిని ఉంచారు. ఆ కోడిని న్యాయస్థానంలో ప్రొడ్యూస్ చేయాలని దాని తీర్పు వచ్చే వరకు కోడిని వదిలేది లేదని చెన్నూరు పోలీసులు చెబుతున్నారు. న్యాయస్థానం తీర్పు వచ్చే వరకు ఆ కోడి ఆ లాకప్‌లో ఉండాల్సిందే మరి.. పాపం దానికి ఏమీ తెలుసు తొడకొడదాం అనుకుంది కానీ ఖైదీ అయింది.. ఈ సంఘటన వారం రోజుల క్రితం చెన్నూరు మండలంలో జరిగింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి