AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నా జీవితంలో నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది.. తమన్ ఎమోషనల్

వైవిధ్యభరితమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ, వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి మరో వైవిధ్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’తో అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వం వహిస్తున్నారు.

నా జీవితంలో నాన్న లేరనే లోటు బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది.. తమన్ ఎమోషనల్
Thaman
Rajeev Rayala
|

Updated on: Jan 11, 2025 | 3:33 PM

Share

వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత నటసింహం, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మరో వైవిద్యభరితమైన చిత్రం ‘డాకు మహారాజ్’. ఈ సినిమా కోసం నందమూరి అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా కంటే ముందు వాల్తేరు వీరయ్య సినిమాతో బాబీ మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ సినిమా గత ఏడాది సంక్రాంతికి విడుదలైంది. ఇక ఇప్పుడు డాకు మహారాజ్ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికలు. బాబీ డియోల్, ఊర్వశి రౌతేలా, చాందిని చౌదరి కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న ‘డాకు మహారాజ్’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.  తాజాగా ఈ మూవీ సెకండ్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకలోసంగీత దర్శకుడు థమన్ మాట్లాడుతూ..

ఓ మై చంద్రముఖి..! ఈ స్టార్ హీరోయిన్ గురువుగారి భార్య..!! ఇది మాములు ట్విస్ట్ కాదు

“ఈ చిత్ర బృందం సృష్టించిన డాకు మహారాజ్ ప్రపంచం చాలా గొప్పది. చాలా కొత్తగా ఉంటుంది. దీని కోసం టీం అంతా ఎంతో కష్టపడ్డారు. కోవిడ్ సమయంలో అఖండ కోసం బాలకృష్ణ గారు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. ‘డాకు మహారాజ్’ కోసం కూడా ఆ స్థాయిలో కష్టపడ్డారు. కొన్ని సినిమాలకు ప్రాణం పెట్టి సంగీతం చేయాలి అనిపిస్తుంది. ఆలాంటి సినిమా ‘డాకు మహారాజ్’. విజయ్ కన్నన్ అద్భుతమైన విజువల్స్ అందించారు. అలాంటి గొప్ప విజువల్స్ వల్లే, నేను మంచి సంగీతం ఇవ్వగలిగాను అన్నారు.

సినిమా అట్టర్ ప్లాప్.. స్టార్ హీరోయిన్‌ను బండబూతులు తిడుతున్న ఫ్యాన్స్

అలాగే  బాలకృష్ణ గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. నా జీవితంలో నాన్న లేరనే లోటు, బాలకృష్ణ గారి వల్ల తీరిపోయింది. నేను బాగుండాలని మనస్ఫూర్తిగా దీవిస్తారు. నన్ను ఆయన ఎంతో నమ్మారు. అందుకే బాలకృష్ణ గారి సినిమాలకి మరింత బాధ్యతగా మనసు పెట్టి సంగీతం అందిస్తాను. ఈ సినిమాతో దర్శకుడిగా బాబీ మరో స్థాయికి వెళ్తారు. నాగవంశీ గారు నా కెరీర్ లో పిల్లర్ లాగా నిలబడ్డారు. సితార ఎంటర్టైన్మెంట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ భారీ బ్లాక్ బస్టర్ గా నిలవబోతుంది. మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం.” అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి