Dil Raju: ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు.. కారణం ఏంటంటే

దిల్ రాజు ప్రొడ్యూసర్ గా ఈ సంక్రాంతికి రెండు సినిమాలను రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. అలాగే వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Dil Raju: ప్రజలకు క్షమాపణలు చెప్పిన దిల్ రాజు.. కారణం ఏంటంటే
Dil Raju
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 11, 2025 | 3:03 PM

ప్రముఖ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. రీసెంట్ గా నిజామాబాద్ లో సంక్రాంతికి వస్తున్నాం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ లో దిల్ రాజు మాట్లాడుతూ.. దావత్ చేసుకుందాం.! తాగుదాం.! అని మాట్లాడారు. దాంతో కొంతమంది తెలంగాణ సంస్కృతిని దిల్ రాజు తక్కువ చేసి మాట్లాడారు అని కామెంట్స్ చేశారు. దాంతో ఆయన ఓ వీడియో ద్వారా తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కాగా వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా జనవరి 14న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా నటిస్తున్నారు.