AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సినిమా అట్టర్ ప్లాప్.. స్టార్ హీరోయిన్‌ను బండబూతులు తిడుతున్న ఫ్యాన్స్

సినిమా ఇండస్ట్రీ అనేది ఓ రంగుల లోకం. ఈ ప్రపంచంలో అడుగు పెట్టాలని.. రాణించాలని చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక చాలా మంది ముద్దుగుమ్మలు హీరోయిన్స్ గా రాణిస్తూ.. సినిమా సినిమాకు వేరియేషన్స్ చూపిస్తూ దూసుకుపోతున్నారు. పాత్ర డిమాండ్ చేస్తే ఎలా అయినా నటించడానికి కొంతమంది భామలు రెడీ అవుతున్నారు.

సినిమా అట్టర్ ప్లాప్.. స్టార్ హీరోయిన్‌ను బండబూతులు తిడుతున్న ఫ్యాన్స్
Actress
Rajeev Rayala
|

Updated on: Jan 10, 2025 | 7:15 PM

Share

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల హవా నడుస్తుంది. ఇప్పుడు హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా అన్ని భాషల్లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ లోనూ అవకాశాలు అందుకుంటూ అక్కడ కూడా అభిమానులను సొంతం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కొంతమంది బాలీవుడ్‌లోకి అడుగు పెట్టి బోల్తా పడుతున్నారు. సౌత్ లో సత్తా చాటి నార్త్‌లో చతికల పడుతున్నారు కొందరు భామలు. ఫలితంగా అటు నార్త్ ఆడియన్స్‌తో ఇటు సౌత్ ఆడియన్స్‌తో తిట్లు తినాల్సి వస్తుంది. ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ పరిస్థితి అలానే తయారయ్యింది. చెయ్యకచెయ్యక హిందీలో ఓ సినిమా చేస్తే అదికాస్తా బోల్తా కొట్టింది. దాంతో పడరాని పట్లు పడుతుంది ఆ అమ్మడు. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి : వాసివాడి తస్సాదియ్యా..! బంగార్రాజు బ్యూటీ అందాల బీభత్సం.. చూస్తే పడిపోవాల్సిందే

బాలీవుడ్ లో సినిమాలు చేయడానికి చాలా మంది హీరోయిన్స్ ఆసక్తి చూపిస్తున్నారు. సౌత్ లో సక్సెస్ అయ్యి నార్త్ లో కూడా జెండా పాతాలి అని అనుకుంటున్నా భామల్లో కీర్తిసురేష్ ఒకరు. తెలుగు, తమిళ్ భాషల్లో కీర్తి స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగులో మహానటి సినిమాతో ఏకంగా జాతీయ అవార్డు కూడా అందుకుంది. అలాగే స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. తమిళ్ లోనూ ఈ అమ్మడు బడా హీరోల సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఇప్పుడు హిందీలోకి అడుగు పెట్టింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Vishal: విశాల్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

రీసెంట్ గా బేబీ జాన్ అనే సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ సినిమా బెడిసి కొట్టింది. తమిళ్ లో సూపర్ హిట్ అయినా తేరి సినిమాను హిందీలో రీమేక్ చేశారు. ఈ సినిమాలో వరుణ్ ధావన్ హీరోగా నటించడగా అట్లీ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా నిరాశపరిచింది. దాంతో కీర్తిసురేష్ పై విమర్శలు వెల్లువెత్తాయి. తమిళ్ ఆడియన్స్ కీర్తి పై గరం అవుతున్నారు. అంతే కాదు హిందీ ఇండస్ట్రీ కోసం గ్లామర్ గేట్లు కూడా ఎత్తేసింది కీర్తి. అయితే హిందీలో సినిమాకు నెగిటివ్ టాక్ రావడానికి కారణం తాను ఆ సినిమాకంటే ముందు చేసిన రఘు తాత సినిమానే అని చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. రఘు తాత సినిమా హిందీ భాషకు వెతిరేకంగా ఉంటుంది. ఆ సినిమా వెంటనే హిందీలో సినిమా చేయడం వల్ల అక్కడి ఫ్యాన్స్ రిసీవ్ చేసుకోలేదు అని చెప్పింది కీర్తిసురేష్. అటు హిందీ ఆడియన్స్ తో పాటు ఇటు తమిళ్ ఆడియన్స్ కూడా కీర్తి పై విమర్శలు చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
Re-Entry 2025 కమ్ బ్యాక్ తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్న స్టార్స్​!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
రియల్​ లైఫ్​ కపుల్​ రీల్​ లైఫ్​లోనూ.. అంచనాలు పెంచేస్తున్నారుగా!
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
ఐకాన్ స్టార్ ఇంట క్రిస్మస్ వెలుగులు.. షేర్ చేసిన స్నేహా రెడ్డి
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!
సుదీర్ఘ విరామం తర్వాత వెండితెరపైకి సీనియర్ బ్యూటీ రీఎంట్రీ!