AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఓ మై చంద్రముఖి..! ఈ స్టార్ హీరోయిన్ గురువుగారి భార్య..!! ఇది మాములు ట్విస్ట్ కాదు

సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన సినిమాల్లో చంద్రముఖి ఒకటి. రజినీకాంత్ నటించిన ఏకైక హారర్ మూవీ ఇది. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రజినీకాంత్ తోపాటు ఈ మూవీలో జ్యోతిక తన నటనతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ముఖ్యంగా చంద్రముఖిగా ఆమె నటన అద్భుతం.. ఇప్పటికీ చంద్రముఖి అంటే ఆమె గుర్తుకువస్తుంది.

ఓ మై చంద్రముఖి..! ఈ స్టార్ హీరోయిన్ గురువుగారి భార్య..!! ఇది మాములు ట్విస్ట్ కాదు
Chandramukhi
Rajeev Rayala
|

Updated on: Jan 10, 2025 | 6:44 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ హారర్ మూవీ చంద్రముఖి. రజినీకాంత్ నటించిన ఏకైక హారర్ మూవీ ఇది. 2005లో రిలీజైన ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకులను భయపెడుతూనే ఉంది. ఇప్పుడు టీవీలో వచ్చినా కూడా ఈ సినిమాను కళ్ళార్పకుండా చూసే ఆడియన్స్ ఉన్నారు. ఇక ఈ సినిమాలో జ్యోతిక, నయనతార, ప్రభు, వినీత్, మాళవిక, వడివేలు, నాజర్, మాళవిక, మనోబాల, సోనూసూద్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. పి. వాసు తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ సినిమా అప్పట్లోనే సుమారు 60 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ముఖ్యంగా ఈ సినిమాలో చంద్రముఖి పాత్రలో జ్యోతిక అద్భుతంగా నటించారు. చంద్రముఖి పాత్రలో ఒదిగిపోయి అందరిని భయపెట్టారు జ్యోతిక.

ఇది కూడా చదవండి : వాసివాడి తస్సాదియ్యా..! బంగార్రాజు బ్యూటీ అందాల బీభత్సం.. చూస్తే పడిపోవాల్సిందే

చంద్రముఖి సినిమాలో ప్రతీ పాత్రకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. అందరూ తమతమ నటనతో ప్రేక్షకులను అలరించారు. కాగా చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ కు సహాయపడే రామచంద్ర సిద్ధాంతి పాత్ర గుర్తుందా.? సినిమా సెకండ్ ఆఫ్ లో వచ్చినా.. ఈ పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. అలా సిద్ధాంతి పాత్రలో నటించిన నటుడి పేరు అవినాష్. మైసూర్ కు చెందిన ఆయన ఎక్కువగా కన్నడ, తమిళ సినిమాల్లోనే నటించాడు. స్టార్ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులోనూ ఆయన కొన్ని సినిమాలు చేశాడు. ఇక చంద్రముఖితో పాటు గోల్ మాల్, లక్ష్మీ కల్యాణం, నాగవల్లి, ఒక్కడు, దరువు, ఢమరుకం, రోగ్, రాజు గారి గది 2, లేటెస్ట్ గా అనన్య నాగళ్ల తంతిరం సినిమాల్లో కీలక పాత్రలు పోషించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :Vishal: విశాల్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

ఆయన భార్య ఓ స్టార్ నటి అని మీకు తెలుసా.? అవును ఆయన భార్య మరెవరో కాదు.. కేజీఎఫ్ సినిమాలో నటించిన మాళవిక. కేజీఎఫ్ సినిమా కథ మొత్తం ఆమెకే చెప్తూ ఉంటారు. ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నటించింది ఆమె. ఈ స్టార్ నటి ఎక్కువగా కన్నడ బాషలోనే సినిమాలు చేసింది. అలాగే సీరియల్స్ లోనూ నటించింది. డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఆమె. సినిమాలతో పాటు రాజకీయాల్లోను రాణిస్తుంది మాళవిక. కర్ణాటకలో బీజీపీ పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు మాళవిక.

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!