AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sukumar- Mahesh Babu: సుకుమార్, మహేష్ బాబు.. తెరవెనక ఏదో జరుగుతుందబ్బా..?

సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని చాలా కాలంగా సినీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. వారిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన నేనొక్కడినే సినిమా ఫ్లాప్ యినా.. దానికి కల్ట్ ఫాలోయింగ్ బాగానే ఉంది. ఆ సినిమాను ఇంకాస్త బాగా తీసుంటే నెక్ట్స్ లెవల్‌లో ఉండేదని గతంలో సుకుమార్ కొన్ని సార్లు బాధపడ్డారు. మరోవైపు మహేష్ బాబు కూడా సుకుమార్‌తో కలిసి సినిమా చేయాలన్న ఇంట్రెస్ట్‌తో ఉన్నారు.

Sukumar- Mahesh Babu: సుకుమార్, మహేష్ బాబు.. తెరవెనక ఏదో జరుగుతుందబ్బా..?
Mahesh Babu, Sukumar
Praveen Vadla
| Edited By: |

Updated on: Jan 10, 2025 | 6:51 PM

Share

సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్‌లో సినిమా వస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ ఇద్దరూ కలిసి చేసిన నేనొక్కడినే సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ దానికి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఆ సినిమాను ఇంకాస్త బాగా తీసుంటే నెక్ట్స్ లెవల్‌లో ఉండేదని ఇప్పటికీ బాధ పడుతుంటాడు సుకుమార్. మరోవైపు మహేష్ బాబు కూడా వన్ సినిమా ఫలితంపై చాలా సార్లు మాట్లాడాడు. అది ఫ్లాప్ అయినా కూడా తన కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్నాడు. మహేష్ అన్నాడని కాదు గానీ నిజంగానే నేనొక్కడినే సినిమా భలే ఉంటుందబ్బా అనేవాళ్లు చాలా మంది ఉన్నారు.

ఆ సినిమా ఇప్పుడు వచ్చినా కూడా చూస్తూనే ఉంటారు ఫ్యాన్స్. అందుకే ఈ కాంబినేషన్‌లో మరొక్క సినిమా పడితే బాగుండు అని ఎప్పటికప్పుడు కోరుకుంటూనే ఉంటారు. అన్నీ అనుకున్నట్లు జరిగుంటే ఈ పాటికే మహేష్, సుక్కు కాంబినేషన్‌లో రెండో సినిమా వచ్చి మూడేళ్లై ఉండేది. పుష్ప కంటే ముందే మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసాడు లెక్కల మాస్టారు. అప్పట్లో ఈ ఇద్దరూ కలిసి అనౌన్స్ చేసిన సినిమా అనుకోకుండా ఆగిపోయింది. అప్పుడే పుష్ప లైన్‌లోకి వచ్చాడు. అలా అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు. ఈ గ్యాప్‌లో అనిల్ రావిపూడి, పరశురామ్, త్రివిక్రమ్ లాంటి దర్శకులతో పని చేసాడు మహేష్. ఇక పుష్ప 2 తర్వాత సుకుమార్ రేంజ్ ఎలా పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

ఇలాంటి టైమ్‌లో గానీ మహేష్, సుక్కు సినిమా పడితే అంతకంటేనా అంటున్నారు అభిమానులు. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు అనుకోవచ్చు.. తాజాగా సుకుమార్ భార్య తబిత సుకుమార్ నిర్మించిన గాంధీ తాత చెట్టు ట్రైలర్‌ను మహేష్ విడుదల చేసాడు. ఆ మధ్య ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయనే వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేయడం చూసాక.. కలిసి పని చేస్తారేమో అనే ఆశలు చిగురిస్తున్నాయి. అయితే ఈ కాంబో ఎక్స్‌పెక్ట్ చేయాలంటే కనీసం మూడేళ్ళు ఆగాల్సిందే. ప్రస్తుతం రాజమౌళితో సినిమా కమిటయ్యాడు మహేష్. మరోవైపు రామ్ చరణ్‌తో సినిమా చేయబోతున్నాడు సుకుమార్. మరి ఈ కాంబినేషన్ కలుస్తుందో లేదో చూడాలిక.

మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
మాఘ మాసంలో నదీ స్నానానికి ఎందుకంత ప్రాధాన్యత? ఏం చేయాలి? చేయకూడదో
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
హీరోగా కాకపోతే క్రికెటర్ అయ్యేవాడిని..
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
చిన్న వయసులోనే తెల్ల జుట్టు ఎందుకొస్తుంది.. అసలు నిజాలు తెలిస్తే
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
బట్టతల, పల్చటి జుట్టును ఒత్తుగా మార్చే సింపుల్ చిట్కాలు..!
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
అసలే అమావాస్య అర్ధరాత్రి.. కల్లాపి కోసం ఇంటి వరండాలోకి..
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
3 ఏళ్ల తర్వాత రీఎంట్రీ.. కట్‌చేస్తే.. గంభీర్, సూర్య స్కెచ్‌కు బలి
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
రేషన్ కార్డులేనివారికి బంపర్ ఛాన్స్.. ప్రభుత్వం మళ్లీ అవకాశం
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
స్పీ బాలు చెప్పిన మాటలు.. మరోసారి మీ ముందుకు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
ఘోర ప్రమాదం.. ట్రాక్ తప్పిన రైళ్లు.. చెల్లాచెదురైన బతుకులు..
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే
నో రూల్స్ అంటున్న సమంత, నయన్, రష్మిక..కాన్సట్రేషన్ అంతా దాని మీదే