ఇంత హాట్ బ్యూటీని ఎలా మిస్ అయ్యారు భయ్యా..! ఆరెంజ్ మూవీలో చరణ్ ఎక్స్‌గర్ల్ ఫ్రెండ్ గుర్తుందా.?
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రేమ కథా చిత్రం ఆరెంజ్. జెనీలియా హీరోయిన్ గా నటించింది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇందులోని పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. అయితే థియేటర్లలో ఆరెంజ సినిమా రిలీజైనప్పుడు ఎందుకో చాలా మందికి నచ్చలేదు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. ఆచార్య సినిమా తర్వాత రామ్ చరణ్ నటించిన సినిమా పైగా దాదాపు ఆరేళ్ళ తర్వాత చరణ్ సోలోగా చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక గేమ్ ఛేంజర్ సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తుంది. విడుదలైన అన్ని కేంద్రాల నుంచి ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. గేమ్ ఛేంజర్ సినిమాకు తమన్ సంగీతం అందించారు. అలాగే ఈ సినిమాలో చరణ్ సరసన అంజలి, కియారా అద్వానీ హీరోయిన్ గా నటించగా.. సునీల్, శ్రీకాంత్, రాజీవ్ కనకాల, ఎస్ జే సూర్య కీలక పాత్రల్లో నటించారు..
ఇది కూడా చదవండి : వాసివాడి తస్సాదియ్యా..! బంగార్రాజు బ్యూటీ అందాల బీభత్సం.. చూస్తే పడిపోవాల్సిందే
ఇదిలా ఉంటే చరణ్ సినిమాల్లో చాలా మంది ఫెవరేట్ సినిమా ఏది అంటే టక్కున చెప్పే మూవీ ఆరంజ్. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలైన సమయంలో ప్రేక్షకులకు అంతగా ఎక్కలేదు. ఆరెంజ్ సినిమాను చాలా మంది విమర్శించారు. కానీ ఇప్పటికీ ఆ సినిమాకు క్రేజ్ తగ్గలేదు. టీవీల్లో ఆరెంజ్ సినిమాను కదలకుండా చూసే ప్రేక్షకులు ఉన్నారు. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఆరెంజ్ సినిమాలో చరణ్ కు జోడీగా జెనీలియా నటించింది .
ఇది కూడా చదవండి :Vishal: విశాల్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ అమ్మాయి గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే
అంతే కాదు ఈ సినిమాలో మరికొంతమంది భామలు కూడా నటించారు. అలాగే చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ గా నటించిన భామల్లో పైన కనిపిస్తున్న అమ్మడు ఒకరు. జెనీలియాను తన ప్రేయసి అని చరణ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధుకు పరిచయం చేస్తాడు. ఆ మధునే ఈ బ్యూటీ. సినిమాలో కనిపించింది కొంతసేపే అయినా తన అందంతో ఆకట్టుకుంది. ఆమె అసలు పేరు మధురిమా.. ఆతర్వాత నైరా బెనర్జీగా మార్చుకుంది. తెలుగులో ఆ ఒక్కడు అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగులో సరదాగా కాసేపు, షాడో, వేట, కొత్త జంట,టెంపర్, దోచాయ్ సినిమాల్లో నటించింది. అలాగే తమిళ్ , హిందీ భాషలోనూ కనిపించింది ఈ బ్యూటీ. ఇక ఇప్పుడు ఈ అమ్మడు చాలా మారిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే నైరా .. హాట్ ఫొటోలతో మత్తెక్కిస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి