Major: ఈ సినిమాతో నా కల తీరింది.. ఆ సమయంలో భయం వేసింది.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల ఆసక్తికర వ్యాఖ్యలు..

(major) చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న

Major: ఈ సినిమాతో నా కల తీరింది.. ఆ సమయంలో భయం వేసింది.. మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల ఆసక్తికర వ్యాఖ్యలు..
Sri Charan
Follow us

|

Updated on: May 26, 2022 | 7:03 AM

టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో డైరెక్టర్ శశి కిరణ్ తిక్క నటించిన లేటేస్ట్ చిత్రం మేజర్. 26/11 దాడులలో వీరమరణం పొందిన జవాన్ మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (major) చిత్రాన్ని మహేష్ బాబు జీఏంబీ ఎంటర్టైన్మెంట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ తో కలిసి సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా భారీగా నిర్మించింది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ మూవీ తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా జూన్ 3న విడుదల కానుంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా మేజర్ చిత్రానికి సంగీతం అందించిన మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ చరణ్ పాకాల ఓ ఇంటర్వ్యూలో పాల్గోని ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చారు.

శ్రీ చరణ్ పాకాల మాట్లాడుతూ.. ” మేజర్ లో చాలా లేయర్స్ వున్నాయి. యాక్షన్, థ్రిల్లింగ్ మూమెంట్స్. లవ్ స్టొరీ, ఎమోషన్.. ఇలా చాలా లేయర్స్ వున్నాయి. 90లో ప్రేమకథ వుంది. 90 మ్యూజిక్ కి నేను పెద్ద ఫ్యాన్ ని. లవ్ సాంగ్ లో ఆ ఫీల్ తీసుకురావడానికి ప్రయత్నించా. నేను చేసిన ఫస్ట్ బయోపిక్ ఇది. ఇంతపెద్ద ప్రాజెక్ట్ రావడంతో నా కల నెరవేరినట్లయింది. మేజర్ సందీప్ అద్భుతమైన సినిమా. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన సినిమా. అన్ని భాషలకు సంగీతం సమకూర్చడం కష్టమైన పనే. ఎందుకంటే ఒక భాష నుండి మరో భాషకి వెళ్ళినపుడు లిరిక్స్ మారిపోతాయి. లిరిక్స్ తో పాటు ట్యూన్ కూడా మౌల్ద్ అవుతుంది. ఇది చాలా కేర్ ఫుల్ గా హ్యాండిల్ చేశాం.

ఇవి కూడా చదవండి

26/11 తాజ్ ఘటన జరిగినప్పుడు నేను చిన్న కుర్రాడిని. మొదటిసారి మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫోటో చూసినప్పుడు నా మనసులో ఘాడంగా ముద్రపడిపోయింది. సందీప్ ముఖం, నవ్వు వెంటాడుతూనే వున్నాయి. అలాంటిది ఇంతకాలం తర్వాత సందీప్ బయోపిక్ అడవి శేష్ చేస్తున్నాడనేసరికి ఎక్సయిట్ అయ్యాను. అదే సమయంలో భయం కూడా వేసింది. చాలా బాధ్యతతో చేయాల్సిన సినిమా ఇది. ఇప్పటివరకూ నేను చేసిన ‘మేజర్’ వర్క్ కి మంచి రెస్పాన్స్ రావడం ఆనందంగా వుంది. ఇప్పటికీ మేజర్ సాంగ్స్ ట్రెండింగ్ లో వున్నాయి. స్క్రిప్ట్ విన్న దగ్గర నుండి ఫైనల్ మిక్స్ వరకూ వుండాలి. ఐతే చేయక తప్పదు అనుకునే పరిస్థితిలో మాత్రం చేస్తాను. కానీ పర్శనల్ గా మాత్రం ఈ విధానం నాకు నచ్చదు”.. అంటూ చెప్పుకొచ్చారు..

దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?