AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sonali Bendre: క్యాన్సర్ నుంచి పాఠాలు నేర్చుకున్నాను.. ఇది లక్ష్యం కాదు.. చేదు జ్ఞపకాలను గుర్తుచేసుకున్న సోనాలి..

2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడింది సోనాలి. ఈ ప్రాణాంతకమైన వ్యాధి నుంచి కోలుకుని ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు సోనాలి.

Sonali Bendre: క్యాన్సర్ నుంచి పాఠాలు నేర్చుకున్నాను.. ఇది లక్ష్యం కాదు.. చేదు జ్ఞపకాలను గుర్తుచేసుకున్న సోనాలి..
Sonali
Rajitha Chanti
|

Updated on: May 26, 2022 | 8:24 AM

Share

మురారి సినిమాతో తెలుగు తెరకు హీరోయిన్ గా పరిచయమైంది సోనాలి బింద్రే. అందం, అభినయంతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోస్ సరసన స్క్రీన్ షేర్ చేసుకుంటూ అగ్ర కథానాయికగా దూసుకుపోయింది. మహేష్ బాబుతో మురారి సినిమా చేసిన సోనాలి.. ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో ఇంద్ర మూవీలోనూ ఆడిపాడింది. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించిన సోనాలి.. పెళ్లి తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఆ తర్వాత 2018లో మెటాస్టాటిక్ క్యాన్సర్ బారిన పడింది సోనాలి. ఈ ప్రాణాంతకమైన వ్యాధి నుంచి కోలుకుని ప్రస్తుతం పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు సోనాలి. ఇప్పుడిప్పుడే సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తూ.. బాలీవుడ్ ఇండస్ట్రీలో పలు రియాల్టీ షోలో పాల్గోంటున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సోనాలి.. తాను క్యాన్సర్ తో పోరాడిన రోజులను గుర్తుచేసుకున్నారు.

సోనాలి మాట్లాడుతూ.. “క్యాన్సర్ బారిన పడి కోలుకున్న వారి జీవితాలు.. క్యాన్సర్ కు ముందు.. క్యాన్సర్ తర్వాత అన్నట్లుగా ఉంటాయి. నా శరీరంపై సర్జరీ గాయాన్ని అలాగే వదిలేసింది.. శరీరంలో వచ్చే మార్పులను స్వీకరించాలి.. మనిషి తన జీవితంలో ఏదో ఒక దానివల్ల పాఠాలు నేర్చుకోవాలి.. నేను క్యాన్సర్ నుంచి కొన్ని పాఠాలు నేర్చుకున్నాను. ఇది లక్ష్యం మాత్రమే కాదు.. ఒక ప్రక్రియ. మన జీవిత ప్రయాణం ఎప్పుడూ ఆగిపోకూడదు.. క్యాన్సర్ తో పోరాడి దాని నుంచి బయటపడినందుకు నేను కృతజ్ఞతతో ఉన్నాను.. ట్రీట్ మెంట్ తీసుకున్న రోజులు నా జీవితంలో అత్యంత కష్టమైన దశ. నేను ఆసుపత్రిలో చేరినప్పుడు వైద్యులు ఎంత తొందరగా వీలైతే అంత తొందరంగా ఇంటికి పంపుతామని తెలిపారు ” అంటూ క్యాన్సర్ చికిత్స్ తీసుకున్న రోజులను గుర్తుచేసుకున్నారు సోనాలి..

ఇవి కూడా చదవండి

ఇక సోనాలి సినిమాల్లోకి కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లుగా గత కొద్ది రోజులుగా టాక్ వినిపిస్తోంది. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా..తెలుగులోనూ పలు చిత్రాలు చేసేందుకు ఆమె ఆసక్తి చూపిస్తున్నట్లుగా సమాచారం.

పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
పులివెందులలో కనిపించిన అరుదైన పునుగుపిల్లి! దీని ప్రత్యేకత ఏంటంటే
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
గుడ్‌న్యూస్‌..ఏపీ వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో
చెత్త, ప్లాస్టిక్ ఇస్తే.. కూరగాయలు, స్నాక్స్‌ ఇస్తారు వీడియో