దుల్కర్ సల్మాన్, హను రాఘవపూడి, స్వప్న సినిమా ‘సీతా రామం’ ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్‌కు (Dulquer Salmaan) తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది..కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన మహానటి సినిమాలో జెమిని గణేషన్ పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ఈ హీరో. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా సీతా రామం. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తుండగా.. వైజయంతీ మూవీస్ సమర్పణ లో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. యుద్ధ నేపధ్యంలో అందమైన ప్రేమకథగా తెరకెక్కుతుతున్న ఈ చిత్రంలో మృణాళిని ఠాకూర్ హీరోయిన్ పాత్రలో కనిపించగా రష్మిక మందన్న కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రమోషనల్ కంటెంట్ తో ఇప్పటికే భారీ అంచనాలు పెంచిన ఈ చిత్రం విడుదల తేదిని తాజాగా నిర్మాతలు ఖరారు చేశారు.
ఆగస్టు 5న ‘సీతా రామం’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రం విడుదల చేస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్ లో భాగంగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన ఫస్ట్ సింగల్ ‘ఓ సీతా- హే రామా’ పాటకు మంచి ఆదరణ లభించింది. సంగీత ప్రేమికుల మనసులో ఎప్పటిటికీ నిలిచిపోయే స్థానం సంపాదించుకుంది. విశాల్ చంద్రశేఖర్ స్వరపరిచిన ఈ లవ్లీ మోలోడీ చార్ట్ బస్టర్ గా నిలిచి ఆల్బమ్ మరిన్ని అంచనాలు పెంచింది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు. అడిషనల్ సినిమాటోగ్రఫీని శ్రేయాస్ కృష్ణ అందిస్తున్నారు.
Are you ready to get mesmerised by Sita? Experience Sita’s world in theatres near you on 𝐀𝐮𝐠 𝟓𝐭𝐡, 𝟐𝟎𝟐𝟐 ♥️#SitaRamam@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @VyjayanthiFilms @SwapnaCinema @Composer_Vishal @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/WuL7eTyNTn
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) May 25, 2022