Agent Movie: మనాలిలో ‘ఏజెంట్’ షూటింగ్.. అక్కినేని అఖిల్ లుక్స్ అదుర్స్..
ప్రస్తుతం చిత్ర యూనిట్ మనాలిలో హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని సూపర్వైజ్ చేస్తున్నారు.

యంగ్ అండ్ డైనమిక్ స్టార్ అక్కినేని అఖిల్ (Akhil Akkineni) హీరోగా తెరకెక్కుతున్న లేటేస్ట్ చిత్రం ఏజెంట్ (Agent). డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇందులో అఖిల్ మరింత స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. ప్రస్తుతం చిత్ర యూనిట్ మనాలిలో హైవోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. యాక్షన్ కొరియోగ్రాఫర్ విజయ్ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్ ని సూపర్వైజ్ చేస్తున్నారు. అఖిల్ తో పాటు చిత్రంలోని కీలక నటీనటులు షూటింగ్ లో పాల్గొంటున్నారు.
ఈ సందర్భంగా విడుదల చేసిన వర్కింగ్ స్టిల్ లో దర్శకుడు సురేందర్ రెడ్డి, డీవోపీ రసూల్ ఎల్లోర్, విజయ్ మాస్టర్ సెట్స్ లో కనిపించారు. హై వోల్టేజ్ స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం కోసం అఖిల్ పూర్తిగా మేకోవర్ అయ్యారు. ప్రస్తుతం అఖిల్ మనాలి ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ లో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తోంది. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు. ఈ చిత్రానికి హిప్ హాప్ తమిజా సంగీతం అందించగా, రసూల్ ఎల్లోర్ ఛాయాగ్రహకుడిగా పని చేస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 12న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమాకు అజయ్ సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.




Grappling to STRIKE HARD ??#AGENT shoot progressing at a brisk pace in Manali with fierce action sequences??#AgentLoading@AkhilAkkineni8 @mammukka @DirSurender @hiphoptamizha @AnilSunkara1 @S2C_offl#AGENTonAugust12 pic.twitter.com/nUSgMlk6R6
— BA Raju’s Team (@baraju_SuperHit) May 25, 2022
View this post on Instagram




