AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Major-Aha: ఆహాలో మేజర్ టీం సందడి.. సర్కార్ 2, తెలుగు ఇండియన్ ఐడల్‏లో అడివి శేష్..

ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 3న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన మేజర్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో

Major-Aha: ఆహాలో మేజర్ టీం సందడి.. సర్కార్ 2, తెలుగు ఇండియన్ ఐడల్‏లో అడివి శేష్..
Aha Major
Rajitha Chanti
|

Updated on: May 25, 2022 | 4:09 PM

Share

ప్రస్తుతం మేజర్ చిత్రం ప్రమోషన్లలో బిజీగా ఉంది.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అడివి శేష్ (Adivi Sesh) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జూన్ 3న విడుదలకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే విడుదలైన మేజర్ ట్రైలర్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేసింది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో మేజర్ టీం సందడి చేసింది. ఈ వారం ఆహాలో అడివి శేష్, శోభిత ధూళిపాళ కలిసి ‘సర్కార్ 2 ‘, ‘తెలుగు ఇండియన్ ఐడల్’ షోలలో పాల్గోన్నారు.

ఓటీటీ ప్లాట్‌ఫాం మనకు లెక్కలేనన్ని కథలు మరియు షోలను అందించింది. అది మనం ఎలాంటి మూడ్‌లో ఉన్నప్పటికీ మనల్ని అలరించేలా చేసింది. అలా తెలుగు లోగిల్లలో ఎప్పుడూ కొత్తదనాన్ని వెదజల్లే ప్లాట్‌ఫాం మన ఆహా. ఈవారం కూడా ఎప్పుడూ చూడని విధంగా సందడిని, సంగీతసుస్వరాల్ని మన ముందుకు తేనుంది. తెలుగు ఇండియన్ ఐడల్, సర్కార్ 2 వంటి షోలతో వినియోగదారులను ఆకర్షించిన 100% లోకల్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫాం , ఈ వారం ‘మేజర్’ టీమ్‌ అడివి శేష్, శోభిత ధూళిపాళ తో తమ ప్రియమైన అభిమానులని అలరించబోతుంది.

ఇవి కూడా చదవండి

యాంకర్ ప్రదీప్ మాచిరాజు హోస్ట్ చేస్తున్న షో సర్కార్ 2 . వారం వారం అందరిని అలరిస్తూ, మైమరిపిస్తున్న ప్రదీప్ ఈ సారి మేజర్ టీం తో అల్లరి చేయబోతున్నాడు.. అడివి శేష్ ప్రేక్షకులని అలరిస్తూ వేసే స్టెప్స్ అందరిని ఉర్రూతలూగిస్తాయి. ఈ షో శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

సంగీతం అంటే తెలుగు ఇండియన్ ఐడల్ లోని స్వరాలూ అనేలా ప్రఖ్యాతి గాంచింది తెలుగు ఇండియన్ ఐడల్. ఈ షోలో ఈ వారం అడివి శేష్, శోభిత చేసే అల్లరి అంతాఇంతా కాదు. వాగ్దేవి పాట వల్ల అడివి శేష్ మైమరిచిపోతే, ఆయనే వైష్ణవి డాన్స్ చేయాలని కోరడం మరో విశేషం. అలా ఆట పాటలతో సాగిపోయే ఈ సుస్వరాల వేదిక తెలుగు ఇండియన్ ఐడల్ షో ఈ శుక్రవారం, శనివారలలో ఆహా లో రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుంది.