Vikranth Rona: విక్రాంత్ రోణ నుంచి మాస్ సాంగ్ రిలీజ్.. కిచ్చా సుదీప్ జోడీగా జాక్వెలిన్..

జాక్వ‌లైన్‌ న‌ర్తించిన ఈ సాంగ్‌ను విక్రాంత్ రోణ మూవీ ఆల్బ‌మ్‌ నుంచి తొలి సాంగ్‌గా విడుద‌ల చేశారు.

Vikranth Rona: విక్రాంత్ రోణ నుంచి మాస్ సాంగ్ రిలీజ్.. కిచ్చా సుదీప్ జోడీగా జాక్వెలిన్..
Kichcha Sudeep
Follow us
Rajitha Chanti

|

Updated on: May 26, 2022 | 6:52 AM

శాండిల్‌వుడ్‌ బాద్‌షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ త్రీడీ మూవీ `విక్రాంత్ రోణ‌`. ప్రముఖ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణలో శాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్‌‌, శాలిని మంజునాథ్ నిర్మించిన ‘విక్రాంత్ రోణ‌’ చిత్రాన్ని అనుప్‌ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని జూలై 28న విడుద‌ల చేస్తున్నారు. బుధవారం ఈ చిత్రం నుంచి రా రా రాక్కమ్మా.. అనే పక్కా మాస్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో గ‌దాంగ్ రాక్క‌మ్మా పాత్ర‌లో బాలీవుడ్ బ్యూటీ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. జాక్వ‌లైన్‌ న‌ర్తించిన ఈ సాంగ్‌ను విక్రాంత్ రోణ మూవీ ఆల్బ‌మ్‌ నుంచి తొలి సాంగ్‌గా విడుద‌ల చేశారు.

త్రీడీ మిస్ట‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన విక్రాంత్ రోణ టీజ‌ర్ విడుద‌లైన‌ప్ప‌టి నుంచి సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ రేంజ్‌కు చేరుకున్నాయి. ఈ అంచ‌నాల‌ను మ‌రింత పెంచే క్ర‌మంలో సినిమా నుంచి ‘రా రా రాక్కమ్మా’ అనే ఫుట్ ట్యాపింగ్ సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఇందులో గ‌దాంగ్ రాక్క‌మ్మ పాత్ర‌ధారిగా బాలీవుడ్ స్టార్ జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్ మెస్మ‌రైజ్ చేస్తుంది. మంగ్లీ, న‌కాష్ అజీజ్ పాడిన ఈ పాట‌ను రామ‌జోగ‌య్య శాస్త్రి రాశారు. సాంగ్ చూస్తే ఓ పార్టీ సాంగ్ అని తెలుస్తోంది. కిచ్చా సుదీప్‌, జాక్వ‌లైన్ ఈ పాట‌లో చేసిన డాన్స్‌, పాట బీట్ వింటే రేపు సిల్వ‌ర్ స్క్రీన్‌పై సినిమా సంద‌డి చేయ‌టం ప‌క్కా అని తెలుస్తోంది.

ఈ సంద‌ర్భంగా జాక్వ‌లైన్ మాట్లాడుతూ ‘‘రాక్కమ్మా ఓ డిఫ‌రెంట్ సాంగ్. పాట చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో ఎంతో ఎంజాయ్ చేశాను. మంచి ట్యూన్‌కు చ‌క్క‌టి లిరిక్స్ కుదిరాయి. దాన్ని అద్భుతమైన డాన్స్ సాంగ్‌గా చిత్రీక‌రించారు. పాన్ ఇండియా లెవ‌ల్లో మాస్ ఆడియెన్స్‌కు న‌చ్చే సాంగ్ అవుతుంద‌న‌డంలో సందేహం లేదు. ఈ సాంగ్‌లో హుక్ స్టెప్‌ను ఎవ‌రైనా ఒక‌సారైనా వేయాల‌ని భావిస్తారు.

ఇవి కూడా చదవండి

విక్రాంత్ రోణ చిత్రాన్ని క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో పాన్ ఇండియా మూవీగా విడుద‌ల చేస్తున్న సంగ‌తి తెలిసిందే. సినిమా కంటెంట్‌ను కూడా అలాగే ఐదు భాష‌ల్లో విడుద‌ల చేస్తున్నారు. ఈ క్ర‌మంలో సోమ‌వారం ఈ సాంగ్ క‌న్న‌డ వెర్ష‌న్ రిలీజైంది. హిందీ వెర్ష‌న్ మంగ‌ళ‌వారం విడుద‌ల కాగా.. బుధ‌వారం తెలుగు వెర్ష‌న్ సాంగ్‌ను విడుద‌ల చేశారు. ఇక త‌మిళ‌, మ‌ల‌యాళ వెర్ష‌న్ సాంగ్ వ‌రుస‌గా విడుద‌లవుతున్నాయి. ప్ర‌పంచ వ్యాప్తంగా జూలై 28న రిలీజ్ అవుతున్న త్రీడీ చిత్రం విక్రాంత్ రోణ. కిచ్చా సుదీప్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాను అనూప్ భండారి డైరెక్ట్ చేస్తున్నారు. జాక్వ‌లైన్ ఫెర్నాండెజ్‌, నిరూప్ భండారి, నీతా అశోక్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

ఆసియా కప్ టైటిల్‌ మనదే.. ఫైనల్‌లో బంగ్లాపై ఘన విజయం

ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..

మేక పాలు తాగితే శరీరానికి ఎంత మంచిదో తెలుసా..? ఈ వ్యాధులకు అమృతం!

క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. 8 టీంల మహా జాతరకు రంగం సిద్ధం

పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.

పార్సిల్‌లో వచ్చిన ఆ డెడ్ బాడీ ఎవరిది..?

3 చారిత్రక ప్యాలెస్‌ల్లో సింధు వివాహ వేడుకలు.. ఎక్కడెక్కడో తెలుసా

వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..

హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ

Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు
Astrology 2025: రాహుకేతువులతో ఆ రాశుల వారికి రాజయోగాలు
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.

శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.

నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.

ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!

బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో