యాక్టర్‌గా మారిన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్

యాక్టర్‌గా మారిన తెలుగు మ్యూజిక్ డైరెక్టర్
Music Director Koti as IPS Officer Vyas In Devineni

వినసొంపైన ట్యూన్స్‌తో శ్రోతలను మెస్మరైజ్ చేసిన సంగీత దర్శకుడు కోటి.  టాలీవుడ్‌లోని టాప్ హీరోల సినిమాలకు ఆయన బాణీలు అందించారు. అయితే, ఇప్పుడు ఆయన వెండితెరపై నటుడిగా సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ‘దేవినేని’ చిత్రం కోసం పోలీస్‌ ఆఫీసర్‌గా మారారు. నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో నందమూరి తారకరత్న కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘దేవినేని’. ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గురువారం సంగీత దర్శకుడు కోటికి […]

Ram Naramaneni

|

Sep 13, 2019 | 4:38 AM

వినసొంపైన ట్యూన్స్‌తో శ్రోతలను మెస్మరైజ్ చేసిన సంగీత దర్శకుడు కోటి.  టాలీవుడ్‌లోని టాప్ హీరోల సినిమాలకు ఆయన బాణీలు అందించారు. అయితే, ఇప్పుడు ఆయన వెండితెరపై నటుడిగా సందడి చేయడానికి సిద్ధమయ్యారు. ‘దేవినేని’ చిత్రం కోసం పోలీస్‌ ఆఫీసర్‌గా మారారు. నర్రా శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో నందమూరి తారకరత్న కీలక పాత్ర పోషిస్తున్న చిత్రం ‘దేవినేని’. ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. గురువారం సంగీత దర్శకుడు కోటికి సంబంధించిన లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.

ఈ సందర్భంగా దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘ఈ చిత్రంలో నటీనటులు అందరూ బాగా నటించారు. నటించారు.. ముఖ్యంగా చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్న కుమార్, దేవినేని నెహ్రూగా నందమూరి తారక రత్న ఆ పాత్రల్లో పరకాయ ప్రవేశం చేశారు. సురేష్ కొండేటి వంగవీటి రంగగా అలరించనున్నారు. 1983 లో విజయవాడ ఫస్ట్ సూపరింటెండెంట్‌ ఆఫ్ పోలీస్ కేఎస్‌ వ్యాస్ పాత్రను ప్రముఖ సంగీత దర్శకుడు కోటి పోషిస్తున్నారు.ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తి అయింది. మరో షెడ్యూల్‌ తో టాకీ పార్ట్ పూర్తవుతుంది. పతాక సన్నివేశాల్ని గుంటూరు జిల్లా చిలకలూరిపేట హై వే లో భారీగా చిత్రకరించడానికి సన్నాహాలు చేస్తున్నాం” అన్నారు.

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘నా కెరీర్ లో ఇది రెండో దశ. సంగీత దర్శకుడిగా దాదాపు 20 సంవత్సరాలు రాణించాను. ఇప్పుడు ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా మీ ముందుకు రాబోతున్నాను. శివనాగు వచ్చి మీరు ఈ క్యారెక్టర్ చేయాలి అనగానే నా చిన్నప్పుడు మా నాన్న నన్ను పెద్ద ఐపీఎస్‌ ఆఫీసర్‌గా చూడాలనుకున్న విషయం గుర్తుకు వచ్చి వెంటనే ఒప్పుకొన్నాను. ఆర్.టి.ఆర్ ఫిలింస్ పతాకంపై రాము రాథోడ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సౌత్‌ నార్త్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలో బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. అందులో భాగంగా దేవినేని నెహ్రు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘దేవినేని’.  మరి ఈ బయోపిక్ ఎంతమేరా ఆకట్టుకుంటుందో చూడాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu