మహేశ్, విజయశాంతి..ఓ 30 ఏళ్ల ప్లాష్ బ్యాక్!
సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందనా హీరోయిన్. అలనాటి తార విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్నేళ్లుగా వెండితెరకు దూరమై..పాలిటిక్స్‌లో ఉన్న ఆమె ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే మళ్లీ మేకప్ వేసుకున్న ఆమె తాజా షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతిని ఉద్దేశించి మహేశ్‌బాబు ట్వీట్ చేశారు. కృష్ణ హీరోగా విజయశాంతి హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ‘కొడుకు […]

సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. రష్మిక మందనా హీరోయిన్. అలనాటి తార విజయశాంతి కీలక పాత్ర పోషిస్తున్నారు. కొన్నేళ్లుగా వెండితెరకు దూరమై..పాలిటిక్స్‌లో ఉన్న ఆమె ఈ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నారు. ఇటీవలే మళ్లీ మేకప్ వేసుకున్న ఆమె తాజా షెడ్యూల్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విజయశాంతిని ఉద్దేశించి మహేశ్‌బాబు ట్వీట్ చేశారు.
కృష్ణ హీరోగా విజయశాంతి హీరోయిన్‌గా పలు చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. అందులో ‘కొడుకు దిద్దిన కాపురం’ కూడా ఒకటి. ఇందులో మహేశ్‌బాబు కూడా నటించారు. ఆ చిత్ర సెట్స్‌లో విజయశాంతితో దిగిన ఫొటోను ట్విటర్ వేదికగా పంచుకుంటూ.. ‘1989లో ఇక్కడే మా జర్నీ ప్రారంభమైంది. అదే కొడుకు దిద్దిన కాపురం. మళ్లీ 30ఏళ్ల తర్వాత విజయశాంతిగారితో పనిచేస్తున్నా. జీవితం అనేది నిజంగా చక్రంలాంటిది” అని పేర్కొన్నారు.
శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్ ఇందులో ఆర్మీ అధికారి అజయ్‌కృష్ణగా కనిపించనున్నారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, మహేశ్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రామబ్రహ్మం సుంకర, దిల్‌రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు.