తూచ్! నాగచైతన్య సినిమా స్టార్ట్ కాలేదుగా

తూచ్! నాగచైతన్య సినిమా స్టార్ట్ కాలేదుగా

అక్కినేని నాగచైతన్య, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుందని అన్నారు. అయితే మళ్ళీ ఈ సినిమా గురించి ఎక్కడా న్యూస్ రాలేదు. అయితే తాజాగా ఈ చిత్రం ఫైనల్ అయిందని చెబుతూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన శాటిలైట్ హక్కుల్ని తామే కొనుగోలు చేశామని ప్రముఖ ఛానల్ జెమినీ టీవీ ప్రకటించింది. అంతేకాదు సినిమాకు ‘అదే […]

Ravi Kiran

|

Sep 12, 2019 | 8:39 PM

అక్కినేని నాగచైతన్య, నిర్మాత దిల్ రాజు కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతుందని అప్పట్లో ప్రచారం జరిగింది. ఇందులో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తుందని అన్నారు. అయితే మళ్ళీ ఈ సినిమా గురించి ఎక్కడా న్యూస్ రాలేదు. అయితే తాజాగా ఈ చిత్రం ఫైనల్ అయిందని చెబుతూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన శాటిలైట్ హక్కుల్ని తామే కొనుగోలు చేశామని ప్రముఖ ఛానల్ జెమినీ టీవీ ప్రకటించింది. అంతేకాదు సినిమాకు ‘అదే నువ్వు అదే నేను’ అనేది టైటిల్ అని కూడా రివీల్ చేసింది. ఇలా మేకర్స్ అధికారికంగా వెల్లడించకుండా.. శాటిలైట్ హక్కుదారులు ప్రకటించడం ఇదే మొదటిసారి. ఇక ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతేనా లేక మరెవరైనా అనేది తెలియాల్సి ఉంది.

మరోవైపు చైతూ ప్రస్తుతం ‘వెంకీ మామ’తో పాటు శేఖర్ కమ్ముల సినిమా చేస్తుండగా, రష్మిక మహేష్‌తో ‘సరిలేరు నీకెవ్వరు’ నితిన్ చేస్తున్న ‘భీష్మ’ చిత్రాల్లో నటిస్తోంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu