‘గ్యాంగ్ లీడర్’ ప్రివ్యూ టాక్: ఏడిపించేసిన నాని..!

'గ్యాంగ్ లీడర్' ప్రివ్యూ టాక్: ఏడిపించేసిన నాని..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’. అదే టైటిల్‌తో ఇప్పుడు నాని.. మనముందుకు ఓ గ్యాంగ్‌ని వేసుకుని వచ్చేశాడు. ట్రైలర్ చూస్తుంటేనే.. కాస్త కామెడీగా.. మరికొంత సస్పెన్స్‌గా ఉంది. ఈ సినిమాకి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించగా.. నవీన్ ఎర్నేని, వై రవి శంకర్, మోహన్ చెరుకూరిలు నిర్మతగా వ్యవహరించారు. మంచి టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి నాని గ్యాంగ్‌ లీడర్ ప్రివ్యూ టాక్‌ ఎలా ఉంది..? […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Sep 13, 2019 | 9:59 AM

మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమా ‘గ్యాంగ్ లీడర్’. అదే టైటిల్‌తో ఇప్పుడు నాని.. మనముందుకు ఓ గ్యాంగ్‌ని వేసుకుని వచ్చేశాడు. ట్రైలర్ చూస్తుంటేనే.. కాస్త కామెడీగా.. మరికొంత సస్పెన్స్‌గా ఉంది. ఈ సినిమాకి విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించగా.. నవీన్ ఎర్నేని, వై రవి శంకర్, మోహన్ చెరుకూరిలు నిర్మతగా వ్యవహరించారు. మంచి టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మరి నాని గ్యాంగ్‌ లీడర్ ప్రివ్యూ టాక్‌ ఎలా ఉంది..? ఎంత అల్లరి చేశాడో.. తెలుసుకుందామా..!

Nani's Gang Leader Movie Preview Talk

మొదట స్లోగా.. సినిమా మొదలవుతుంది. ఒకరి తర్వాత ఒకరు మనకు పరిచయం అవుతూ.. కథ సాగుతూ ఉంటుంది. మెల్ల.. మెల్లగా.. ఊపందుకుంటుంది. ఇక అక్కడక్కడ వచ్చే సన్నివేశాలకు ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటారు. వెన్నెల కిషోర్‌కి.. చాలా రోజుల తర్వాత మంచి టైమింగ్ దొరికింది.. ఇంకేంటి.. కడుపు చెక్కలయ్యేలా నవ్విస్తాడు. నవ్వులతో.. అలా సాగిపోతున్న కథలోకి ఓ ట్విస్ట్‌ని ఇస్తూ.. ఇంటర్‌వెల్ వస్తుంది. ఇక సెకండాఫ్ మొత్తం.. సీరియస్ మోడ్‌లోకి వెళ్తుంది. మంచి స్క్రీన్‌ ప్లేతో ప్రీ క్లైమాక్స్ వరకూ ఒక్కో సన్నివేశం భావోద్వేగానికి గురి చేస్తూ ఉంటుంది. ఆడియన్స్‌ని అటు నవ్వులతో.. ఇటు ఎమోషన్స్‌ రాబట్టడంలో విక్రమ్ కుమార్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.

కాగా.. ఇప్పటికే యూఎస్‌లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. అక్కడ సినిమా చూసిన వాళ్లు తమ తమ అభిప్రాయాలను ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. అవేంటో మీరూ చూసేయండి.

Nani’s Gang Leader Movie Preview Talk, Tolly Wood Hero Nani, Hero Nani, Nani New Movie, Gang Leader Movie Preview Talk, Gang Leader Film Preview Talk, Gang Leader Preview Talk, Preview Talk, Gang Leader, Director Vikram Kumar, Producers, Naveen Yerneni, Y. Ravi Sankar and Mohan Cherukuri

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu