సినిమా హిట్ అయితేనే నన్ను లేపండి..!

న్యాచురల్ స్టార్‌గా పేరుతెచ్చుకన్న నాని.. తాజాగా.. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సందర్భంగా.. నాని ట్విట్టర్‌లో ట్వీట్ పెడుతూ.. సినిమా హిట్‌ అయితేనే.. నన్ను నిద్ర లేపండి.. లేదంటే.. డోంట్ డిస్టర్బ్ అని.. లక్ష్మీగారిపై తల వాల్చుకుని ఉన్న ఫొటోతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి ‘ఫలక్‌నుమ దాస్’ హీరో విశ్వక్‌ సేన్ స్పందించి.. సినిమా సూపర్ హిట్ అవుతుంది..! భయ్యా.. అంటూ రీట్వీట్ చేశారు. […]

  • Tv9 Telugu
  • Publish Date - 10:20 am, Fri, 13 September 19
సినిమా హిట్ అయితేనే నన్ను లేపండి..!

న్యాచురల్ స్టార్‌గా పేరుతెచ్చుకన్న నాని.. తాజాగా.. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా చేశారు. ప్రస్తుతం ఈ సినిమా ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఈ సందర్భంగా.. నాని ట్విట్టర్‌లో ట్వీట్ పెడుతూ.. సినిమా హిట్‌ అయితేనే.. నన్ను నిద్ర లేపండి.. లేదంటే.. డోంట్ డిస్టర్బ్ అని.. లక్ష్మీగారిపై తల వాల్చుకుని ఉన్న ఫొటోతో ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కి ‘ఫలక్‌నుమ దాస్’ హీరో విశ్వక్‌ సేన్ స్పందించి.. సినిమా సూపర్ హిట్ అవుతుంది..! భయ్యా.. అంటూ రీట్వీట్ చేశారు. దానికి నాని థ్యాంక్యూ చెప్పాడు. అలాగే.. నాని ట్వీట్‌ చూసిన కొంతమంది.. సినిమా అదిరిపోయింది.. భయ్యా.. మేము ప్రీమియర్ షో చూశాము.. మీరు ఇంక లేవండి అంటూ ట్వీట్స్ చేస్తున్నారు.

నాని హీరోగా.. విక్రమ్ కె.కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్‌పై నవీన్ ఎర్నేని, వై రవి శంకర్, మోహన్ చెరుకూరిలు నిర్మించారు. ఈ సినిమాలో.. ప్రముఖ నటి లక్ష్మీ, శరణ్య, అనీశ్ కురువిల్లా, ప్రియదర్శి, రఘుబాబు, వెన్నెల కిషోర్, ప్రాణ్య కీలక పాత్రలు పోషించారు. ఇక ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ హీరో కార్తికేయ విలన్‌గా నటించారు.

కాగా.. ఇప్పటికే అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలు పడ్డాయి. దీంతో.. గ్యాంగ్ లీడర్ చూసిన చాలా మంది సినిమా చాలా బావుందని..  డైరెక్టర్ బాగా.. డైరెక్ట్ చేశారని వాళ్ల వాళ్ల అభిప్రాయాలను ట్వీట్ చేస్తున్నారు.