AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరో సినిమా వల్ల సత్య సాయి బాబు‌పై నమ్మకం పోయింది.. కానీ ఆ తరువాత

సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్స్ ను అందించిన నిర్మాత, నటుడు మురళీమోహన్. ఆయన బ్యానర్‌లో పలు సినిమాలు తెరకెక్కాయి. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉన్నారు మురళీమోహన్. 2014 లోక్ సభ ఎన్నికలలో తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా రాజమండ్రి నియోజక వర్గం నుండి గెలిచారు.

ఆ హీరో సినిమా వల్ల సత్య సాయి బాబు‌పై నమ్మకం పోయింది.. కానీ ఆ తరువాత
Murali Mohan
Rajeev Rayala
|

Updated on: Jan 14, 2026 | 1:46 PM

Share

ప్రముఖ నటుడు మురళీమోహన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు హీరోగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు మురళీమోహన్. హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మురళి మోహన్ ఆతర్వాత సహాయక పాత్రల్లో నటించి మెప్పించారు. హీరోలకు అన్నయ్యగా.. ఆతర్వాత తండ్రి పాత్రల్లో నటించి మెప్పించారు మురళీ మోహన్. ఇటీవలే ఆయన బాలకృష్ణ నటించిన అఖండ 2లో కనిపించి మెప్పించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మురళీ మోహన్ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఓ హీరో వల్ల తనకు సాయి బాబ అంటే నమ్మకం పోయింది అని అన్నారు ఈ సీనియర్ నటుడు.

నటుడు మురళీ మోహన్ సత్యసాయి బాబా పట్ల తన వ్యక్తిగత అనుభవాలను, ఆయనపై తన అభిప్రాయం ఎలా మారిందో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. సత్యసాయి బాబా ప్రవచించిన “సబ్ కా మాలిక్ ఏక్ హై” సిద్ధాంతాన్ని మురళీ మోహన్ ప్రస్తావిస్తూ.., మానవత్వానికి ఒకే దైవశక్తి ఉందని, దానిని ఏ పేరుతోనైనా కొలవవచ్చని అన్నారు మురళీ మోహన్. అయితే, తన చిన్న వయస్సులో సత్యసాయి బాబా పట్ల తనకు పెద్దగా అభిమానం ఉండేది కాదని మురళీ మోహన్ తెలిపారు. బాబా ధరించే పట్టు వస్త్రాలు, బంగారు ఊయలలో ఊగడం వంటివి తనకు నచ్చేవి కావని తెలిపారు.

అదేసమయంలో ఎన్.టి.రామారావు నటించిన ఒక సినిమాలో ఒక నటుడు జుట్టు గుబురుగా పెంచి దొంగ బాబా పాత్రలో నటించడం కూడా బాబా పట్ల తనకున్న వ్యతిరేక భావనను పెంచిందని అన్నారు మురళీమోహన్. కానీ, అనంతపురంలోని సత్యసాయి కాలేజీ విద్యార్థులు ఒక వార్షికోత్సవానికి ఆహ్వానించిన తర్వాత మురళీ మోహన్ తన ఆలోచన పూర్తిగా మారిపోయింది అని అన్నారు. ఆ కాలేజీ విద్యార్థులు గొడవలు, స్ట్రైక్‌లు లేకుండా, ఉపాధ్యాయులను గౌరవిస్తూ, క్రమశిక్షణతో ఉండటం చూసి ఆయన ఆశ్చర్యపోయారు. విద్యార్థులకు ఉచిత విద్య, భోజనం, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నారని, బాబా అప్పుడప్పుడు వచ్చి తరగతులకు భంగం కలగకుండా బయటి నుండి చూసి వెళుతుంటారని, మెస్సుకు వెళ్లి వంటవాళ్లను కూడా పలకరిస్తుంటారని విద్యార్థులు చెప్పడం తనను కదిలించిందని అన్నారు. తర్వాత, సత్యసాయి బాబా చేపట్టిన సామాజిక సేవా కార్యక్రమాల గురించి తెలుసుకున్నప్పుడు ఆయనకు బాబా పట్ల దైవత్వం కనిపించింది. పుట్టపర్తిలో నిర్మించిన అద్భుతమైన ఆసుపత్రిలో ధనిక, పేద తేడా లేకుండా అందరికీ ఉచిత వైద్యం అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే, కరువు జిల్లా అయిన అనంతపురం సహా రాయలసీమ, సర్కారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని అనేక జిల్లాలను దత్తత తీసుకుని ఉచిత తాగునీటి సౌకర్యాన్ని కల్పించడాన్ని మురళీ మోహన్ ప్రశంసించారు. విద్య, భోజనం, వసతి, వైద్యం, నీరు వంటి ప్రాథమిక అవసరాలను తీర్చే వ్యక్తి నిజంగా దైవం మానవ రూపంలో ఉన్నట్లే అని ఆయన అప్పుడు భావించా అని మురళీ మోహన్ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వరుణ్ సందేశ్ వైఫ్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందంటే.?
వరుణ్ సందేశ్ వైఫ్ యూట్యూబ్ ద్వారా ఎంత సంపాదిస్తుందంటే.?
ఒకప్పుడు చంద్రబాబు ప్రొటోకాల్ ఆఫీసర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్
ఒకప్పుడు చంద్రబాబు ప్రొటోకాల్ ఆఫీసర్.. ఇప్పుడు స్టార్ యాక్టర్
సముద్రంలో అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో
సముద్రంలో అలా చూస్తూ ఉండిపోవాల్సిందే.. అమేజింగ్ వీడియో
10,000 అడుగుల మ్యాజిక్.. రోజూ నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుత..
10,000 అడుగుల మ్యాజిక్.. రోజూ నడిస్తే మీ శరీరంలో జరిగే అద్భుత..
సంక్రాంతి నాడు నువ్వుల లడ్డు ఎందుకు తింటారు? ప్రాముఖ్యత తెలుసా?
సంక్రాంతి నాడు నువ్వుల లడ్డు ఎందుకు తింటారు? ప్రాముఖ్యత తెలుసా?
పాము కాటేసిందనీ.. చొక్కా జేబులో వేసుకుని ఆస్పత్రికెళ్లాడు! వీడియో
పాము కాటేసిందనీ.. చొక్కా జేబులో వేసుకుని ఆస్పత్రికెళ్లాడు! వీడియో
చైనీస్ మాంజాను ఏలా రక్షించుకోవాలో తెలుసా?
చైనీస్ మాంజాను ఏలా రక్షించుకోవాలో తెలుసా?
పొట్ట ఐస్‌లా కరగాల్సిందే.. రోజూ సోంపును ఇలా తీసుకుంటే అద్భుతాలే..
పొట్ట ఐస్‌లా కరగాల్సిందే.. రోజూ సోంపును ఇలా తీసుకుంటే అద్భుతాలే..
టాస్ గెలిచిన కివీస్..బ్యాటింగ్‌కు దిగనున్న టీమిండియా
టాస్ గెలిచిన కివీస్..బ్యాటింగ్‌కు దిగనున్న టీమిండియా
అంత్యక్రియలు చేస్తుండగా.. ఊహించని షాక్..!
అంత్యక్రియలు చేస్తుండగా.. ఊహించని షాక్..!