Salman Khan: సల్మాన్ ఖాన్‏కు హత్య బెదిరింపులు.. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..

నటుడు సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన నిందితుడిని పట్టుకోవడంలో ముంబై పోలీసులు ఘన విజయం సాధించారు. ముంబయిలోని వర్లీ పోలీసులు నిందితులను బాంద్రా ప్రాంతంలో అరెస్ట్ చేశారు. నిందితుడి పేరు ఆజం మహ్మద్ ముస్తఫా. రూ.2 కోట్లు ఇవ్వకపోతే సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించడంతో అతడిపై వర్లీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.

Salman Khan: సల్మాన్ ఖాన్‏కు హత్య బెదిరింపులు.. నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు..
Salman Khan
Follow us

|

Updated on: Oct 31, 2024 | 2:54 PM

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‏కు కొన్ని నెలలుగా హత్య బెదిరింపులు వస్తున్న సంగతి తెలిసిందే. అతడిని చంపేస్తామని.. లేదంటే రూ. 5 కోట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తూ ఇప్పటికే పలుమార్లు కాల్స్, లేఖలు రావడంతో ముంబై పోలీసులు మరింత అలర్ట్ అయ్యారు. దీంతో సల్మాన్ ఖాన్ తోపాటు మరికొందరు స్టార్స్ కు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. సల్మాన్ ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ కు హత్య బెదిరింపులకు పాల్పడిన నిందితులను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబయిలోని వర్లీ పోలీసులు నిందితులను బాంద్రా ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిందితుడు ఆజం మహ్మద్ ముస్తఫా సల్మాన్ ఖాన్ నుంచి రూ.2 కోట్లు డిమాండ్ చేశాడు. డబ్బు ఇవ్వకపోతే సల్మాన్ ను చంపేస్తామని హెచ్చరించాడు.

సల్మాన్ ఖాన్ ను బెదిరించిన నిందితులకు ఎవరైనా సపోర్ట్ చేశారా.. ? వీరికి బిష్ణోయ్ గ్యాంగ్‏తో ఏమైనా సంబంధాలు ఉన్నాయా ? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన ఎమ్మెల్యే జీషన్ సిద్ధిఖీని చంపుతానని బెదిరించిన 20 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. జీషాన్ సిద్ధిఖీని ఫోన్‌లో బెదిరించే సమయంలో సల్మాన్ ఖాన్ గురించి కూడా ప్రస్తావించాడు. సల్మాన్ ఖాన్‌ను బెదిరించిన నిందితుడిని ఈరోజు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 29వ తేదీ ఉదయం 10.09 గంటలకు వర్లీ ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ కు గుర్తుతెలియని ఫోన్ చేసి రూ.2 కోట్లు ఇవ్వకుంటే సల్మాన్ ఖాన్ ను చంపేస్తానని బెదిరించాడు. దీంతో నిందితులపై వర్లీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.

నిందితుడి ఫోన్ నంబర్ సీడీఆర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ సమాచారం ఆధారంగా నిందితుడు ఉంటున్న ప్రదేశంలో రహస్య నిఘా పెట్టారు. అనంతరం నిందితుల పూర్తి సమాచారాన్ని పోలీసులు రాబట్టారు. అలాగే, నిందితుడిని బాంద్రా ప్రాంతంలో అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచగా.. రేపటి వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.

ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‏గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్‏ను ఇప్పుడు చూస్తే షాకే..

Tollywood: ఫోక్ సాంగ్‏తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్‏గా అదరగొట్టేసింది..

Tollywood: అమ్మడు ఇది నువ్వేనా.. ఈ రేంజ్ ఛేంజ్ ఏంటమ్మా.. దృశ్యంలో వెంకీ కూతురు చూస్తే మైండ్ బ్లాంకే..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
ముచ్చింతల్‌లో అంబరాన్నంటిన దీపావళి సంబరాలు.. సమతామూర్తి ప్రాంగణం
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మేం ముంబైకి వెళ్లిపోయింది అందుకే.! జ్యోతిక పై సూర్య కామెంట్స్.
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
మతిపోయే థ్రిల్లర్ మూవీ.! శవంతో రొమాన్స్.! ఇదేం అరాచకం..
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
తప్పుడు కేసులో దొరికి.. చేజేతులారా కెరీర్‌ను నాశనం చేసుకుంది.!
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
నాదే లేట్‌.! అయినా ప్రభాస్‌ అర్థరాత్రి వరకు నా కోసం వెయిట్ చేశాడు
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
బంగారం.. ఎప్పుడు కొంటే మంచిది.? పక్క దేశాల ప్రభావం మన దగ్గర కూడా.
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
హీరో 100 కోట్ల కల.. నెరవేరితే ఆ తెలుగు ప్రొడ్యూసర్ ఫోటో ఆయన ఇంట్ల
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
AA చేతిలో చరణ్ గేమ్‌ ఛేంజర్‌ మూవీ.! చెర్రీ కెరియర్ లో హయ్యస్ట్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దర్శన్‌కు బెయిల్‌.! రేణుకా స్వామి తండ్రి షాకింగ్ రియాక్షన్..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..
దుల్కర్ సల్మాన్‌పై బాలయ్య జోకులు, ఫన్నీ పంచులు.! వీడియో..