Pushpa 2: పుష్ప 2 నుంచి లేటెస్ట్ పోస్టర్.. రొమాంటిక్ లుక్‌లో పుష్ప, శ్రీవల్లి
అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శకత్వంలో వస్తోన్న పుష్ప2 చిత్రం కోసం ఫిలిమ్ ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. డిసెంబర్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా చిత్ర యూనిట్ దీపావళిని పురస్కరించుకొని కొత్త పోస్టర్ ను విడుదల చేసింది..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పుష్ప2పై భారీ అంచనాలు ఉన్న విషయం తెలిసిందే. పుష్ప సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే దాదాపు మొత్తం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని డిసెంబర్ 5వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
దీంతో సినిమా ప్రమోషన్స్‌ను ఇప్పటికే అధికారికంగా మొదలు పెట్టిన చిత్ర యూనిట్ ఒక్కో అప్‌డేట్ ఇస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా దీపావళి పండుగను పురస్కరించుకొని చిత్ర యూనిట్ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అల్లుఅర్జున్, రష్మికలమ రొమాంటిక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వంటింట్లో శ్రీవల్లితో పుష్ప రొమాన్స్ చేస్తున్న క్యూట్ ఫొటోను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ పోస్టర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
ఇక పుష్ప-2 ది రూల్ చిత్రాన్ని ఏకంగా ఆరు భాషల్లో కలిపి 11,500 స్క్రీన్స్‌లో విడుదల చేసేందకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఓవర్‌సీస్‌లో 5వేల స్క్రీన్స్, భారత్‌లో 6500 స్క్రీన్స్‌లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇలా పుష్ప2 విడుదలకు ముందే సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. భారతీయ సినీ చరిత్రలో బిగ్గెస్ట్ రిలీజ్ ఇండియన్ సినిమాగా పుష్ప2 నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Happy Diwali!! #Pushpa2TheRule pic.twitter.com/V5Xcp4RF7y
— Allu Arjun (@alluarjun) October 31, 2024
ఎర్రచందనం సిండికేట్‌కు అధిపతి అయిన తర్వాత పుష్ప రాజ్ జీవితం ఎలాంటి మలుపు తిరిగింది. ఆ క్రమంలో ఆయన ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నాడు. లాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను సుకుమార్ ఈ పార్ట్‌లో చూపించనున్నారు. ఇక ప్రస్తుతం దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరగాల్సి ఉంది. శ్రద్ధాకపూర్ కనిపించనున్న ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ నవంబర్ 4వ తేదీ నుంచి జరగనుందని సమాచారం. ఇది పూర్తి కాగానే పూర్తి స్థాయిలో ప్రమోషన్స్‌ను మొదలు పెట్టేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..