AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nail Color: ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?

Samudrika Shastra: సాముద్రిక శాస్త్రంలో గోళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కాలక్రమేణా చాలా మందిలో గోళ్ల రంగు మారుతూ ఉంటుంది. ఈ మార్పులు వారి ఆరోగ్యం, అదృష్టం, జీవిత పరిస్థితులను సూచిస్తాయని నమ్మకం. ముఖ్యంగా ఎరుపు రంగు గోర్లు ఉన్నవారిని అత్యంత అదృష్టవంతులుగా సాముద్రిక శాస్త్రం పేర్కొంటుంది. ఇప్పుడు దీన్ని వివరంగా తెలుసుకుందాం.

Nail Color: ఈ రంగు గోర్లున్నవారంతా అదృష్టవంతులే..! మరి తెలుపు రంగు ఉంటే..?
Nail Color and Luck
Rajashekher G
|

Updated on: Feb 09, 2026 | 2:50 PM

Share

సాధారణంగా గోర్లు మన ఆరోగ్యానికి సంకేతంగా చెబుతారు. కానీ, ఇప్పుడు మరో కొత్త విషయం గురించి తెలుసుకోవాల్సి ఉంది. సాముద్రిక శాస్త్రం.. జ్యోతిషశాస్త్రం, సంఖ్యాశాస్త్రం లాగానే ముఖ్యమైనదిగా భావించబడుతుంది. ఈ శాస్త్రం ప్రకారం, మన శరీరంలోని ప్రతి భాగం.. చేతులు, కాళ్లు, కళ్ళు, ముఖాకృతి, అలాగే గోర్లు కూడా.. వ్యక్తి స్వభావం, ఆరోగ్యం, భవిష్యత్తు గురించి సంకేతాలు ఇస్తాయి. అందుకే సాముద్రిక శాస్త్రంలో గోళ్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. కాలక్రమేణా చాలా మందిలో గోళ్ల రంగు మారుతూ ఉంటుంది. ఈ మార్పులు వారి ఆరోగ్యం, అదృష్టం, జీవిత పరిస్థితులను సూచిస్తాయని నమ్మకం. ముఖ్యంగా ఎరుపు రంగు గోర్లు ఉన్నవారిని అత్యంత అదృష్టవంతులుగా సాముద్రిక శాస్త్రం పేర్కొంటుంది. ఇప్పుడు దీన్ని వివరంగా తెలుసుకుందాం.

ఎరుపు రంగు గోర్లు అదృష్టానికి సంకేతం

సాముద్రిక శాస్త్రం ప్రకారం.. ఎరుపు రంగు, మెరిసే గోర్లు ఉన్నవారు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటారు. వీరికి సాధారణంగా మంచి ఆరోగ్యం ఉంటుంది. శారీరక శక్తి అధికంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు ఉత్సాహంగా, చురుకుగా ఉంటారు.

ఎరుపు రంగు గోర్లు ఉన్నవారికి అదృష్టం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. సంపదలో కొరత ఉండదు, ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. వారి వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. జీవితంలో భౌతిక సౌకర్యాలు, సుఖసంతోషాలు సమృద్ధిగా లభిస్తాయి. మంచి విద్య ద్వారా ఉన్నత పదవులు, గౌరవం, ప్రతిష్టను సంపాదిస్తారు.

తెల్లటి గోర్లు మేధస్సుకు సంకేతం..

తెల్లటి గోర్లు ఉన్నవారిని సాధారణ స్వభావం కలవారిగా భావిస్తారు. వీరికి మంచి మేధస్సు, ఆలోచనా శక్తి ఉంటుంది. అయితే, గోళ్లపై తెల్లటి లేదా నల్లటి మచ్చలు కనిపిస్తే.. వారు చిన్న విషయాలకే కోపానికి లోనవుతారు. ఇతరులతో వాదనలు పడే స్వభావం కలిగి ఉంటారు.

ఇలాంటి వారు తరచూ మూఢనమ్మకాలకు లోనవుతారు. కుటుంబ జీవితంలో, ముఖ్యంగా అత్తమామలతో సంబంధాలు అంతగా సాఫీగా ఉండకపోవచ్చని సాముద్రిక శాస్త్రం సూచిస్తుంది.

(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉంది. దీనిని టీవీ9 తెలుగు ధృవీకరించదు.)