- Telugu News Photo Gallery Cinema photos Actress vaishnavi chaitanya latest beautiful photos goes viral
Vaishnavi Chaitanya: దీపావళి స్పెషల్.. కుందనపు బొమ్మల వైష్ణవి చైతన్య
అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసింది.అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ, షార్ట్ ఫిలిమ్స్ లోనూ చేసింది ఈ చిన్నది. మెల్లగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది.
Updated on: Oct 31, 2024 | 1:19 PM

సోషల్ మీడియా ద్వారా ఇండస్ట్రీలోకి వచ్చిన ముద్దుగుమ్మలు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో వైష్ణవి చైతన్య ఒకరు. ఈ ముద్దుగుమ్మ షార్ట్ ఫిలిమ్స్ నుంచి హీరోయిన్ గా మారింది. మొదట్లో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది.

అంతకు ముందు సోషల్ మీడియాలో రకరకాల రీల్స్, యూట్యూబ్ వీడియోలు చేసింది.అలాగే పలు వెబ్ సిరీస్ లోనూ, షార్ట్ ఫిలిమ్స్ లోనూ చేసింది ఈ చిన్నది. మెల్లగా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి మెప్పించింది.

ముఖ్యంగా అలవైకుంఠపురంలో సినిమాలో అల్లు అర్జున్ సిస్టర్ గా నటించింది. అలాగే నాని హీరోగా నటించిన టక్ జగదీష్ సినిమాలో నటించింది. ఇక హీరోయిన్ గా మారి తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది .

బేబీ సినిమాతో హీరోయిన్ గా మారి ప్రేక్షకులను అలరించింది.ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన బేబీ సినిమా సంచలన విజయం సాధించింది. యూత్ ను ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. బేబీ సినిమాలో వైష్ణవి చైతన్య తన నటనతో ఆకట్టుకుంది.

బేబీ సినిమా తర్వాత లవ్ మీ అనే సినిమా చేసింది. ఆశిష్ రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. దాంతో ఈ భామకు ఆఫర్స్ కరువయ్యాయి. అప్పటి నుంచి కొత్త సినిమా అనౌన్స్ చేయలేదు. తాజాగా దీపావళి సందర్భంగా ఇలా ముద్దుగా రెడీ అయ్యి ఫోటోలు షేర్ చేసింది.




