Raghava Lawrence: గుండెపై అమ్మ పచ్చ బొట్టు వేయించుకున్న అభిమాని.. కాళ్లు మొక్కిన లారెన్స్.. వీడియో చూశారా?
హీరోగా, కొరియో గ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా.. ఇలా సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. ఒక స్టేజ్ డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్వయం కృషితో ఆయన ఎదిగిన తీరు చాలామందికి స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఒక స్టార్ హీరోకు ఉన్నట్లే రాఘవ లారెన్స్‌కు అభిమానులు ఉన్నారు.

హీరోగా, కొరియో గ్రాఫర్‌గా, డైరెక్టర్‌గా.. ఇలా సినిమా ఇండస్ట్రీలో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు రాఘవ లారెన్స్. ఒక స్టేజ్ డ్యాన్సర్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్వయం కృషితో ఆయన ఎదిగిన తీరు చాలామందికి స్ఫూర్తిదాయకం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఒక స్టార్ హీరోకు ఉన్నట్లే రాఘవ లారెన్స్‌కు అభిమానులు ఉన్నారు. దీనికి కారణం ఆయన సినిమాలు మాత్రమే కారణం కాదు. ‘రియల్ హీరో’ అనిపించుకుంటూ లారెన్స్ చేస్తోన్న సేవా కార్యక్రమాలు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి ఎప్పుడూ ముందుంటారాయన. ఇప్పటికే తన సేవా ట్రస్టు ఆధ్వర్యంలో ఎంతో మంది చిన్నారులు, అనాథ పిల్లలకు కొత్త జీవితాన్ని అందించారు. ఇటీవల తన ట్రస్టుకు డబ్బులు పంపొద్దంటూ, వాటిని డబ్బుల్లేక ఇబ్బందులు పడే ట్రస్టులకు ఇవ్వాలని సూచించి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఇక సినిమాల్లో స్టైలిష్‌గా కనిపించే రాఘవ లారెన్స్ నిజ జీవితంలో మాత్రం ఎంతో సింపుల్‌గా ఉంటారు. అలా తాజాగా మరొక సారి తన మంచి మనసును చాటుకున్నారీ హీరో అండ్ డైరెక్టర్. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే చంద్రముఖి 2 సినిమాతో మన ముందుకు వచ్చిన రాఘవ లారెన్స్ త్వరలోనే జిగర్తాండా డబుల్ ఎక్స్ అనే సినిమాతో అలరించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. అలా తాజాగా జిగర్తాండా డబుల్ ఎక్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. విక్టరీ వెంకటేష్ ఈ ఫంక్షన్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో రాఘవ లారెన్స్ మాట్లాడుతుండగా ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.
సడెన్‌గా ఓ అభిమాని పరిగెత్తుకుంటూ స్టేజిమీదకు వచ్చి రాఘవ లారెన్స్ కాళ్లపై పడబోయాడు. వెంటనే లారెన్స్ అభిమానిని తన కాళ్లపై పడకుండా ఆపి.. ఆయనే అభిమాని కాళ్లకు దండం పెట్టి నమస్కరించారు. దీంతో అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. స్టేజ్ బౌన్సర్లు ఆ అభిమానిని పక్కకు తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా లారెన్స్ వారిని వారించాడు. కాసేపు ఆ అభిమానితో చాలా ప్రేమగా మాట్లాడాడు. లారెన్స్ తన తల్లికి గుడి కట్టినట్లు తాను కూడా తల్లి ఫొటోను గుండెలపై పచ్చ బొట్టు వేయించుకున్నానంటూ ఆ అభిమాని చూపించాడు. దీనికి చాలా సంతోషించాడు లారెన్స్. అభిమానిని గట్టిగా హత్తుకుని ముద్దు పెట్టారు. దీంతో సదరు అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. అభిమాని చేసిన పనిని మెచ్చుకుంటూనే రాఘవ లారెన్స్ సింప్లిసిటీని అందరూ కొనియాడుతున్నారు.
వీడియో ఇదిగో..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..