Samantha: క్రయోథెరపీ యూజెస్ చెప్పిన సామ్.. నెట్టింట పోస్ట్ వైరల్
సమంత రూత్ ప్రభు ఇప్పుడు క్రయోథెరపీ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. గత కొన్నాళ్లుగా మయోసైటిస్‌తో బాధపడుతున్నారు సమంత. మయోసైటిస్‌కి చికిత్స తీసుకోవడం కోసం కెరీర్‌కి కూడా బ్రేక్ ఇచ్చారు. అయితే ఇటీవల ముంబైలో పలుమార్లు కనిపించారు సమంత. దీంతో ఆమె మయోసైటిస్ నుంచి బాగా కోలుకున్నట్టే అనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా సమంత తన క్రయోథెరపీ గురించి పోస్ట్ పెట్టారు. రికవరీ అంటూ సమంత పెట్టిన పదం వైరల్ అవుతోంది. గెట్ వెల్ సూన్ అంటున్నారు అభిమానులు. క్రయోథెరపీ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET | Edited By: Phani CH
Updated on: Nov 05, 2023 | 6:12 PM

సమంత రూత్ ప్రభు ఇప్పుడు క్రయోథెరపీ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు. గత కొన్నాళ్లుగా మయోసైటిస్‌తో బాధపడుతున్నారు సమంత. మయోసైటిస్‌కి చికిత్స తీసుకోవడం కోసం కెరీర్‌కి కూడా బ్రేక్ ఇచ్చారు.

అయితే ఇటీవల ముంబైలో పలుమార్లు కనిపించారు సమంత. దీంతో ఆమె మయోసైటిస్ నుంచి బాగా కోలుకున్నట్టే అనే వార్తలు వినిపించాయి. అయితే తాజాగా సమంత తన క్రయోథెరపీ గురించి పోస్ట్ పెట్టారు.

రికవరీ అంటూ సమంత పెట్టిన పదం వైరల్ అవుతోంది. గెట్ వెల్ సూన్ అంటున్నారు అభిమానులు. క్రయోథెరపీ వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుందట. బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుందట. హార్మోన్ల సమతుల్యత సాధ్యమవుతుందట.

ఓ వైపు క్రయోథెరపీ తీసుకుంటూ, మరోవైపు బేబీ క్వీన్ బజ్‌కిల్ సాంగ్ వింటున్నట్టు చెప్పారు సామ్. ఈ పాటతో ప్రేమలో పడ్డట్టు చెప్పారు సమంత. ది మార్వెల్స్ ప్రెస్‌మీట్‌కి కూడా హాజరయ్యారు సామ్. ఈవెంట్‌లో బ్లు డెనిమ్ జీన్స్, వైట్ క్రాప్ టాప్‌తో స్టైలిష్‌గా కనిపించారు.

ఉత్తరాదిన ఆమె నటించిన సిటాడెల్ విడుదల కావాల్సి ఉంది. సామ్ ఫేవరేట్ డైరక్టర్లు రాజ్, డీకే ఈ వెబ్‌సీరీస్‌ని రూపొందించారు. వరుణ్ ధావన్ కీ రోల్ చేశారు సిటాడెల్‌లో. చెన్నై స్టోరీస్ అనే ప్రాజెక్టుతో సమంత హాలీవుడ్ డెబ్యూ ఉంటుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి ఇంకా పూర్తి డీటైల్స్ తెలియాల్సి ఉంది. తమిళ్, ఇంగ్లిష్‌లో చెన్నై స్టోరీస్‌ని తెరకెక్కిస్తారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.





























