- Telugu News Photo Gallery Cinema photos Hero Rana Daggubati Takes Too much Gap For Movies in Tollywood Film Industry Telugu Heroes Photos
Rana Daggubati: టూ మచ్ గ్యాప్ తీసుకుంటున్న రానా.. అసలు కారణం ఏంటంటే..?
సినిమా సినిమాకు రానా ఎందుకు ఇంత బ్రేక్ తీసుకుంటున్నారు..? బయట వినిపిస్తున్నట్లుగానే నిజంగానే ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా.. లేదంటే వెబ్ సిరీస్‌ల కోసమే సినిమాలను దూరం పెడుతున్నారా..? కెరీర్ మొదట్లో ఏడాదికి కనీసం 2, 3 సినిమాలు చేసిన రానా.. ఇప్పుడు ఎందుకు స్లో అయ్యారు..? అసలు దీనిపై రానా రియాక్షన్ ఏంటి..? ఆయనమేంటున్నారు..? మూడు నాలుగేళ్ళ కింద చేతిలో ఎన్ని సినిమాలున్నాయో..
Updated on: Nov 05, 2023 | 3:33 PM

సినిమా సినిమాకు రానా ఎందుకు ఇంత బ్రేక్ తీసుకుంటున్నారు..? బయట వినిపిస్తున్నట్లుగానే నిజంగానే ఈయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నారా.. లేదంటే వెబ్ సిరీస్‌ల కోసమే సినిమాలను దూరం పెడుతున్నారా..?

కెరీర్ మొదట్లో ఏడాదికి కనీసం 2, 3 సినిమాలు చేసిన రానా.. ఇప్పుడు ఎందుకు స్లో అయ్యారు..? అసలు దీనిపై రానా రియాక్షన్ ఏంటి..? ఆయనమేంటున్నారు..? మూడు నాలుగేళ్ళ కింద చేతిలో ఎన్ని సినిమాలున్నాయో.. ఎవరికెప్పుడు డేట్స్ ఇస్తున్నారో తెలియనంత బిజీగా ఉండేవారు రానా.

ఒక్కో ఏడాది 4 సినిమాలు కూడా చేసిన రోజులున్నాయి. కానీ ఇవన్నీ ఒకప్పుడే.. ఇప్పుడు రెండేళ్లకో సినిమా కూడా చేయట్లేదు దగ్గుబాటి వారసుడు. ఈయన నుంచి సినిమా వచ్చి చాలా కాలమైపోయింది.

గతేడాది వచ్చిన విరాట పర్వం, భీమ్లా నాయక్ కూడా ఎప్పుడో సైన్ చేసిన సబ్జెక్టులే. విరాట పర్వం తర్వాత రానా నుంచి మరో సినిమా రాలేదు. నిఖిల్ స్పైలో చిన్న పాత్ర చేసారంతే. పైగా ఈ మధ్య ఎక్కువగా ప్రొడక్షన్‌పై ఫోకస్ చేస్తున్నారు రానా.

దాంతో రానా సినిమాలకు గుడ్ బై చెప్పి.. వెబ్ సిరీస్‌లతో బిజీ అవుతున్నారనే వార్తలొచ్చాయి. ఆ మధ్య బాబాయ్ వెంకీతో కలిసి రానా నాయుడు సిరీస్ చేసారు. దీని సీక్వెల్ త్వరలోనే రానుంది. సినిమాల దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ స్పీడ్ కనిపించట్లేదు.

సినిమా సినిమాకి తనే కావాలనే గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలిపారు రానా. మొదట్లో వరసగా సినిమాలు చేయకపోతే ఆడియన్స్ మరిచిపోతారేమో అనే భయంతో చేసానని..

ఇప్పుడు తానేంటో దేశమంతా తెలిసాక ఓ మంచి సినిమా చేయాలని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు రానా. ప్రస్తుతం రజినీకాంత్, జ్ఞానవేల్ సినిమాలో నటిస్తున్నారీయన. దాంతో పాటు బాహుబలి మేకర్స్‌తో ఓ సినిమా కమిటయ్యారు.




