- Telugu News Photo Gallery Cinema photos Megastar chiranjeevi fans series for no response on shankar dada mbbs is re released telugu entertainment photos
Megastar Chiranjeevi: కోపంగా ఉన్న మెగా ఫ్యాన్స్.. ఎందుకంటే.? ఇంత హర్ట్ అయ్యారా.?
మా చిరంజీవిని వదిలేయండి.. అనవసరంగా పరువు తీయొద్దు.. మేం అడిగామా మిమ్మల్ని మా హీరో సినిమాను మళ్లీ రిలీజ్ చేయమని..? ఎందుకు చేస్తున్నారు..? బయటికి చెప్పట్లేదు కానీ మెగా ఫ్యాన్స్ ఇన్నర్ ఫీలింగ్ అయితే ఇదే ఇప్పుడు. వాళ్లకు అంతగా కోపం రావడానికి కారణమేంటి..? అసలెందుకు చిరంజీవి అభిమానులు ఇంతగా హర్ట్ అయ్యారు..? దీని వెనక కథేంటో చూద్దామా.. చిరంజీవి ఫ్యాన్స్ యమా కోపంగా ఉన్నారు.. సోషల్ మీడియాలోనే వాళ్ల అసంతృప్తి కనిపిస్తుంది.
Updated on: Nov 05, 2023 | 4:44 PM

మా చిరంజీవిని వదిలేయండి.. అనవసరంగా పరువు తీయొద్దు.. మేం అడిగామా మిమ్మల్ని మా హీరో సినిమాను మళ్లీ రిలీజ్ చేయమని..? ఎందుకు చేస్తున్నారు..? బయటికి చెప్పట్లేదు కానీ మెగా ఫ్యాన్స్ ఇన్నర్ ఫీలింగ్ అయితే ఇదే ఇప్పుడు.

వాళ్లకు అంతగా కోపం రావడానికి కారణమేంటి..? అసలెందుకు చిరంజీవి అభిమానులు ఇంతగా హర్ట్ అయ్యారు..? దీని వెనక కథేంటో చూద్దామా.. చిరంజీవి ఫ్యాన్స్ యమా కోపంగా ఉన్నారు.. సోషల్ మీడియాలోనే వాళ్ల అసంతృప్తి కనిపిస్తుంది.

దానికి కారణం శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమానే. ఎప్పుడో 20 ఏళ్ళ కింద వచ్చిన సినిమాతో ఇప్పుడేంటి వాళ్లకు సమస్య అనుకోవచ్చు.. కానీ అక్కడే ఉంది అసలు సమస్యంతా. ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తే కనీస రెస్పాన్స్ కూడా రాలేదు.. దీన్నే అవమానంగా ఫీల్ అవుతున్నారు మెగా ఫ్యాన్స్.

శంకర్ దాదా MBBS రీ రిలీజ్‌కు ఈవెంట్ చేసారు.. ప్రమోషన్ కూడా బాగానే చేసుకున్నారు.. పైగా 20 ఏళ్లుగా దాచేసిన ఓ పాటను రీ రిలీజ్‌లో యాడ్ చేస్తున్నట్లు చెప్పారు. ఇన్ని చేసినా బుకింగ్స్ మాత్రం దారుణంగా ఉన్నాయి.

రెండూ మూడు మెయిన్ స్క్రీన్స్ మినహాయిస్తే.. చాలా థియేటర్స్ ఖాళీగానే ఉన్నాయి. గతంలో ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ సినిమాల రీ రిలీజ్‌కు ఇదే పరిస్థితి ఎదురైంది.

పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్, చరణ్ సినిమాల రీ రిలీజ్‌లకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. అంతెందుకు సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఈ నగారానికి ఏమైంది, 7/జి బృందావాన కాలనీ లాంటి సినిమాలు అదిరిపోయే వసూళ్లు తెచ్చాయి.

కానీ చిరు సినిమాలకు లో రెస్పాన్స్ వచ్చేసరికి ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. మేమడిగామా రీ రిలీజ్ చేయమని.. ఏం అవసరం లేదు.. ఇక ఆపేయండి అంటున్నారు వాళ్లు.




