Jr.NTR: ఇటుక ఇటుకలో ఎన్టీఆర్ నామం.. యంగ్ టైగర్ పేరుతో ఇంటిని కట్టేస్తోన్న అభిమాని.. ఫొటోస్ వైరల్..
ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆయనతో సినిమా చేసేందుకు బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఎదురుచూస్తున్నారు. నటనలోనే కాదు.. డ్యాన్స్ పరంగానూ మెప్పించాడు ఎన్టీఆర్. ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన నటిస్తోన్న సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం తారక్ సినిమాల కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తారక్ పై అభిమాని వినూత్నంగా చాటుకున్నారు.

యంగ్ టైగర్ ఎన్టీఆర్కు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఆయనకున్న క్రేజ్ తెలిసిందే. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మూవీతో నార్త్ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ట్రిపుల్ ఆర్ సినిమాలో కొమురం భీమ్ పాత్రలో తారక్ నటనకు హాలీవుడ్ మేకర్స్ సైతం ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆయనతో సినిమా చేసేందుకు బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం ఎదురుచూస్తున్నారు. నటనలోనే కాదు.. డ్యాన్స్ పరంగానూ మెప్పించాడు ఎన్టీఆర్. ఇక ట్రిపుల్ ఆర్ తర్వాత ఆయన నటిస్తోన్న సినిమాలపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుతం తారక్ సినిమాల కోసం వరల్డ్ వైడ్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే తారక్ పై అభిమాని వినూత్నంగా చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ వీరాభిమాని కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. అయితే తన ఇంటి నిర్మాణానికి ఉపయోగించే ఇటుకలపై ఎన్టీఆర్ పేరును ముద్రించుకున్నాడు.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఇంటి నిర్మాణం కోసం కావాల్సిన మొత్తం ఇటుకలపై తారక్ పేరును ముద్రించారు. అలా తన అభిమాన హీరోపై ప్రేమను చాటుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. తారక్ పై అతడి ప్రేమను చూసి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Kurnool City & Dt@tarak9999 ఒక అభిమాని తన ఇంటి కోసం NTR అనే పేరు గల ఇటికలను తన ఇల్లు నిర్మాణం కోసం కావాలని తెప్పించుకున్నాడు ఇటువంటి అభిమానులు చాలా అరుదుగా ఉంటారు రాయలసీమలో #JaiNTR #ManOfMassesNTR pic.twitter.com/ZtOG35VSYt
— MadhuYadav (jr.NTR) Kurnool (@MadhuYadavTarak) November 3, 2023
ఇదిలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర చిత్రంలో నటిస్తున్నారు. మాస్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులో జాన్వీ గ్రామీణ అమ్మాయిగా కనిపించనుండగా.. తారక్ ఊరమాస్ లుక్ లో కనిపించనున్నారు. అలాగే ఇందులో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, టామ్ చాకో, మురళీశర్మ కీలకపాత్రలు పోషిస్తుండగా.. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. మరోవైపు బాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న వార్ 2 చిత్రంలోనూ నటిస్తున్నారు తారక్. ఇందులో బీటౌన్ హీరో హృతిక్ రోషన్ సైతం నటిస్తుండగా.. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. అటు ఈ మూవీ షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.