Sreeja Konidela : ‘పరిస్థితులు అస్తవ్యస్తంగా మారినప్పుడు మనసు గాయపడుతుంది.. అలా చేయడమే మార్గం’.. శ్రీజ కొణిదెల పోస్ట్..
ఇక ఇప్పటికే నూతన వధూవరులతోపాటు.. మెగా ఫ్యామిలీ సైతం హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. ఉపాసన, స్నేహారెడ్డి, నిహారిక అంతా సోషల్ మీడియా వేదికగా వరుణ్, లావణ్య పెళ్లి ఫోటోస్ షేర్ చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ తన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. పరిస్థితులు చేయి దాటిన సమయంలో మనసు విరిగిపోతుందంటూ ఆసక్తికర పోస్ట్ చేసింది శ్రీజ.

ఇటీవలే మెగా ఇంట్లో పెళ్లి సందడి నెలకొన్న సంగతి తెలిసిందే. నవంబర్ 1న మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి వివాహం టుస్కానీలో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఇరు కుటుంబసభ్యులతోపాటు.. అల్లు ఫ్యామిలీ, సన్నిహితులు సందడి చేశారు. ఇక ఇప్పటికే నూతన వధూవరులతోపాటు.. మెగా ఫ్యామిలీ సైతం హైదరాబాద్ తిరిగి వచ్చేసింది. ఉపాసన, స్నేహారెడ్డి, నిహారిక అంతా సోషల్ మీడియా వేదికగా వరుణ్, లావణ్య పెళ్లి ఫోటోస్ షేర్ చేస్తూ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో తాజాగా మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ తన ఇన్ స్టాలో చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది. పరిస్థితులు చేయి దాటిన సమయంలో మనసు విరిగిపోతుందంటూ ఆసక్తికర పోస్ట్ చేసింది శ్రీజ.
“విషయాలు నా నియంత్రణలో లేనప్పుడు, పరిస్థితులు అస్తవ్యస్తంగా మారి శబ్దం చేస్తున్నప్పుడు హృదయం గాయపడుతుంది. అలాగే మనసు విరిగిపోతుంది. మనస్సు కలత చెంది ఆపై క్షీణిస్తుంది. ఆ సమయంలో శరీరం అలసిపోయి బలహీనంగా మారుతుంది. అలాంటి సమయంలో ఒక్కసారి కళ్లు మూసుకుని మన లోపలికి మనం వెళ్తే.. మనతో మనమే కనెక్ట్ అవుతే అన్ని సెట్ అవుతాయి. ఇదొక్కటే మార్గం!” అంటూ తన ఇన్ స్టాలో రాసుకొచ్చింది శ్రీజ. అయితే ఈ పోస్టుకు కామెంట్లను డిజబుల్ చేసింది. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతుంది.
View this post on Instagram
సోషల్ మీడియాలో శ్రీజ ఎక్కువగా యాక్టివ్గా ఉంటుంది. ఫ్యామిలీ విషయాలతోపాటు.. తన కూతుర్లతో కలిసి గడిపే క్షణాలను నెట్టింట పంచుకుంటుంది. ఆమెకు నివృతి, నవిష్క ఇద్దరు కూతుర్లు ఉన్నారు. 2016లో కళ్యాణ్ దేవ్ తో శ్రీజ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరి విడిపోయారంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయాలపై ఇప్పటివరకు వీరిద్దరు స్పందించలేదు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.