ఈ వయ్యారిని మించిన అందం ఈ జగతిలో తగునా.. సిజ్లింగ్ ప్రగ్య..

16 March 2025

Prudvi Battula 

Credit: Instagram

12 జనవరి 1987న మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని జబల్పూర్‎ అనే ఊరిలో పుట్టి పెరిగింది వయ్యారి భామ ప్రగ్యా జైస్వాల్.

పూణెలోని సింబయాసిస్ యూనివర్శిటీలో లా విద్యను పూర్తి చేసింది.  చదువుతున్న రోజుల్లో వివిధ అందాల పోటీలలో పాల్గొని మోడల్‌గా రాణించింది.

2014లో విడుదలైన విరాట్టు అనే తమిళ చిత్రంతో సినీ అరంగేట్రం చేసింది అందాల భామ. తర్వాత టిటూ MBA అనే హిందీ మూవీలో కనిపించింది.

2015లో మిర్చి లాంటి కుర్రాడు అనే చిత్రంతో తెలుగు తెరకు కథానాయకిగా పరిచయం అయింది ముద్దుగుమ్మ ప్రగ్య జైస్వాల్.

2015లో వరుణ్ తేజ్‎కి జోడిగా కంచె అనే చిత్రంలో కథానాయకిగా ఆకట్టుకుంది ఈ చిన్నది. ఈ చిత్రంలో నటనకి ఐదు అవార్డులు అందుకుంది.

2017లో గుంటూరోడు, నక్షత్రం, చిత్రాల్లో నటించింది. అలాగే ఓం నమో వేంకటేశాయలో అతిథి పాత్ర, జయ జానకి నాయకలో సహాయ పాత్రలో నటించింది.

2018లో ఆచారి అమెరికా యాత్ర చిత్రంలో నటించింది. 2021లో బాలయ్య సరసన అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంది.

ఈ ఏడాది డాకు మహారాజ్ మూవీతో మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం అఖండ 2, టైసన్ నాయుడు చిత్రాల్లో నటిస్తుంది.