బట్టతల వస్తుందని భయమేస్తోందా..ఇదిగో పరిష్కారం వీడియో
ప్రస్తుత కాలంలో అన్ని వయసుల వారిలోనూ హెయిర్ ఫాల్ సాధారణమైపోయింది. పని ఒత్తిడి, పోషకాహార లోపం, నిద్ర లేమి ఇలా అనేక కారణాల వల్ల జుట్టు రాలిపోతుంటుంది. జుట్టు రాలడం ప్రారంభమైన తర్వాత ఇక దానిని నియంత్రించడం కష్టమనే చెప్పాలి. ఒక్కోసారి వెంట్రుకలు పూర్తిగా రాలిపోవడమే కాకుండా.. తిరిగి పెరగవు కూడా.. దీనివల్ల కాన్ఫిడెన్స్ లెవల్స్ దెబ్బతింటాయి.
మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే.. ఉంది.. అది మన పెరట్లోనే ఉంది. ఈ ఒక్క మొక్క మీ ఇంట్లో ఉంటే మీ బట్టతల సమస్య తీరిపోయినట్టే. అదేంటంటే.. కలబంద మొక్క.. దీనినే అలోవెరా అని పిలుస్తారు. దీని జెల్ తీసి తలకు అప్లై చేస్తే క్రమంగా జుట్టురాలుతున్న చోట మళ్లీ జుట్టు వస్తుందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. బట్టతల సమస్య ఉన్నవారికి కలబంద జెల్ ఎలా ఉపయోగపడుతుందో మరింత వివరంగా తెలుసుకుందాం. కలబందలోని పోషకాలు తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, జుట్టు కుదుళ్లను ఉత్తేజపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి తలపై చర్మ సమస్యలను, మంటను తగ్గిస్తాయి. కలబంద తల చర్మం సహజ pH సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. జుట్టు పెరుగుదలకు అవసరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. కలబందలో యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టు రాలడానికి కారణమైన చుండ్రును నియంత్రించడంలో సహాయపడుతుంది. కలబందలో ప్రోటీయోలైటిక్ ఎంజైమ్‌లు కూడా ఉంటాయి. ఇవి చనిపోయిన చర్మ కణాలను సరిచేసి, మూసుకుపోయిన రంధ్రాలను తెరుస్తాయి. అంతే కాకుండా ఇది జుట్టు కుదుళ్ల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. కలబంద తలకు రక్త ప్రసరణను పెంచుతుంది. ఇది జుట్టు కుదుళ్లకు పోషకాలు, ఆక్సిజన్‌ను అందిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం :
గుడ్డును మింగిన పాము.. కక్కలేక మింగలేక…చివరికి.. వీడియో
రాజకీయాల నుంచి సినిమాల్లోకి జగ్గారెడ్డి వీడియో
సెల్‌ఫోన్ ఎఫెక్ట్.. ఆ తల్లి చేసిన నిర్వాకం చూస్తే.. వీడియో
చిరంజీవి, పవన్ కల్యాణ్‌కు నాగబాబు ఎంత అప్పు ఉన్నారో తెలుసా..?

గోల్డ్ వద్దు.. సిల్వర్ ముద్దు.. బంగారం కంటే వెండే బెటర్ ఎందుకంటే?

కన్నకొడుకునే దారుణంగా హత్య చేసిన తండ్రి వీడియో

లెక్చరర్‌ను చెప్పుతో కొట్టిన విద్యార్థిని..ఎందుకంటే వీడియో

ఏఐతో నిరుద్యోగ సునామీ..వారి కామెంట్స్ వైరల్ వీడియో

టేకాఫ్ సమయంలో విమానంలో చెలరేగిన మంటలు వీడియో

బ్రిటన్‌లో మిరాకిల్.. రెండు సార్లు జన్మించిన పిల్లాడు వీడియో

ఏపీలో సీతమ్ము ప్రత్యేక ఆలయం ఉందని తెలుసా? వీడియో
