AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adivi Sesh: క్యాన్సర్‌ బాధిత పిల్లలతో అడివి శేష్‌.. ఆడుతూ పాడుతూ బహుమతుల అందజేత.. హార్ట్‌ టచింగ్‌ వీడియో

తాజాగా జూడ్‌ అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శింశాడు శేష్‌. ఆ సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నాడీ యంగ్ హీరో. అక్కడి చిన్నారులతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేశాడు. వారికి కొన్ని బహుమతులు కూడా అందజేశాడు

Adivi Sesh: క్యాన్సర్‌ బాధిత పిల్లలతో అడివి శేష్‌.. ఆడుతూ పాడుతూ బహుమతుల అందజేత.. హార్ట్‌ టచింగ్‌ వీడియో
Adivi Sesh
Basha Shek
|

Updated on: Nov 05, 2023 | 4:00 PM

Share

టాలీవుడ్‌ యంగ్‌ హీరో అడివి శేష్‌ తన మంచి మనసును చాటుకున్నాడు. నిత్యం సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీగా ఉండే ఈ క్రేజీ హీరో తాజాగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లలతో సరదాగా గడిపారు. వారిలో ఒక్కడిగా కలిసిపోయారు. వారితో ఆడిపాడారు. తాజాగా జూడ్‌ అనే ఓ స్వచ్ఛంద సేవా సంస్థను సందర్శింశాడు శేష్‌. ఆ సంస్థ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొన్నాడీ యంగ్ హీరో. అక్కడి చిన్నారులతో కలిసి సరదాగా డ్యాన్స్‌ చేశాడు. వారికి కొన్ని బహుమతులు కూడా అందజేశాడు. అనంతరం వీటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేశాడు. ‘పిల్లలతో గడపడం నా జీవితంలో చాలా గొప్ప సందర్భం. ఈ పిల్లలు చాలా ధైర్యంగా ఉన్నారు. వారు క్యాన్సర్ తో పోరాటం చేస్తున్నారు. వారు నాకు చాలా ఆశను కల్పించారు. ఈ అవకాశం కల్పించిన కమలేష్, లక్ష్మికి ధన్యవాదాలు’ అంటూ ఎమోషనల్‌ అయ్యాడు శేష్‌. ప్రస్తుతం అడివి శేష్‌ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. హీరో చేసిన గొప్ప పనిని అభిమానులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు. కాగా జూడ్‌ సంస్థ పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంఆ వెనకబడిన కుటుంబాలకు వివిధ రకాలుగా సహాయమందిస్తోంది. అలాగే క్యాన్సర్‌పై పోరాటంలో భాగంగా డ్యాన్స్‌ థెరపీని అందిస్తోంది. ఇందులో భాగంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లలకు రోజూ అరగంట పాటు డ్యాన్స్‌ క్లాస్‌లు ఏర్పాటు చేస్తోంది.

ఇక సినిమాల విషయానికొస్తే.. గతేడాది మేజర్‌, హిట్ 2 సినిమాలతో భారీ హిట్లు ఖాతాలో వేసుకున్నాడు హీరో అడివి శేష్. ప్రస్తుతం గూఢచారి 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 2018లో హీరో శేష్‌ నటించిన గూఢచారి సినిమాకు ఇది సీక్వెల్‌గా తెరకెక్కుతోంది. G2 పేరుతో తెరకెక్కుతోన్న ఈ స్పై థ్రిల్లర్‌ మూవీలో ప్రకాష్ రాజ్, జగపతిబాబు కీలకపాత్రలు పోషించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా పాన్ ఇండియా స్థాయిలో G2 సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌ సినిమాపై ఆసక్తిని పెంచాయి. త్వరలో ‘G2 ‘సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌ డేట్స్‌ వెలువడననున్నాయి.

ఇవి కూడా చదవండి

క్యాన్సర్ బాధిత చిన్నారులతో హీరో శేష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయింది! అప్పట్లో ఏం జరిగిందంటే?
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
కెరీర్ లో తడబడుతున్న బాలీవుడ్ బ్యూటీస్ వీడియో
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
అంచనాలను మించేలా ప్లానింగ్.. ప్రేక్షకుల కోరిక మేరకు అంటున్నా..
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వేతన జీవులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ తగ్గనున్న ఈఎంఐల భారం వీడియో
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
వందే భారత్ ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. షెడ్యూల్‌లో భారీ మార్పులు
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
అద్దెకు 'భర్త'లు.. ఫుల్ ట్రెండ్ అవుతున్న వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో