Bigg Boss 7 Telugu: రైతు బిడ్డ దెబ్బకు సీరియల్ బ్యాచ్‌కు దడ.. మనసులో మాట బయటపెట్టిన అర్జున్..
తాజాగా విడుదలైన ప్రోమోలో కొన్ని సామెతలతో బోర్డులు ఇచ్చి.. ఎవరికి సూట్ అవుతాయో వారి మెడలో వేయాలని చెప్పారు. ముందుగా భోలే రాగా.. అతడికి 'కుక్క తోక వంకర'అనే బోర్డు వచ్చింది. దానిని అమర్ దీప్ మేడలో వేశారు. ఆటల్లో నచ్చుతాడు.. కానీ నామినేషన్లో కూడా రీవెంజ్ అనే పదం వాడి పగ తీర్చుకున్నాడు అంటూ రీజన్ చెప్పాడు భోలే. ఇంకా మారట్లేదు అమర్ అంటావ్ వేసెయ్ అంటూ నాగార్జున అన్నారు. ఇక ఆ తర్వాత అమర్ రాగా.. 'గాడిదకు ఏం తెలుసు గంధపు చెక్క వాసన'
తొమ్మిదో వారం వీకెండ్ వచ్చేసింది. ఇక ముందు నుంచి వినిపిస్తున్నట్లుగా ఈవారం టేస్టీ తేజ హౌస్ నుంచి బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. అలాగే నిన్నటి ఎపిసోడ్ లో జపాన్ సినిమా ప్రమోషన్లలో భాగంగా కోలీవుడ్ హీరో కార్తి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇక నిన్న ఒక్కొక్కరికి క్లాస్ తీసుకున్న నాగ్.. ఈరోజు ఇంటి సభ్యులను సరదాగా ఫన్ క్రియేట్ చేసే టాస్కులు ఇచ్చారు. అలాగే గెస్టులుగా రాఘవ లారెన్స్, ఎస్ జే సూర్య వచ్చారు. జిగర్తాండ డబుల్ ఎక్స్ ప్రమోషన్లలో ఈ ఎపిసోడ్ లో సందడి చేశారు. ఇక తాజాగా విడుదలైన ప్రోమోలో కొన్ని సామెతలతో బోర్డులు ఇచ్చి.. ఎవరికి సూట్ అవుతాయో వారి మెడలో వేయాలని చెప్పారు. ముందుగా భోలే రాగా.. అతడికి ‘కుక్క తోక వంకర’అనే బోర్డు వచ్చింది. దానిని అమర్ దీప్ మేడలో వేశారు. ఆటల్లో నచ్చుతాడు.. కానీ నామినేషన్లో కూడా రీవెంజ్ అనే పదం వాడి పగ తీర్చుకున్నాడు అంటూ రీజన్ చెప్పాడు భోలే. ఇంకా మారట్లేదు అమర్ అంటావ్ వేసెయ్ అంటూ నాగార్జున అన్నారు. ఇక ఆ తర్వాత అమర్ రాగా.. ‘గాడిదకు ఏం తెలుసు గంధపు చెక్క వాసన’ అనే సామెత బోర్డును అశ్విని మెడలో వేశాడు. ఒక డెసిషన్ నుంచి ఇంకో డెసిషన్ కు వెంటనే ఛేంజ్ అయిపోతుంది అంటూ రీజన్ చెప్పాడు.
ఇక అర్జున్ రాగా.. ‘ఏకులా వచ్చి మేకులా తగులుకున్నాడు’ అనే సామెతను ప్రశాంత్ మెడలో వేశాడు. వచ్చినప్పుడు ఎవరు వీడు ఇంత బాగా ఆడతాడని ఊహించలేదు. కానీ ఇప్పుడు ఏమాడుడు అనుకుంటే మేకులా కూర్చున్నాడు అంటూ రీజన్ చెప్పాడు అర్జున్. మొత్తానికి రైతుబిడ్డగా ఎంట్రీ ఇచ్చి.. తన ఆటతో సీరియల్ బ్యాచ్ కు దడ పుట్టించాడు ప్రశాంత్. ఈ వారం కెప్టెన్సీ టాస్కులలో మొదటి గేమ్ కాగానే.. అతడిని గేమ్ నుంచి తప్పించారు హౌస్మేట్స్. దీంతో ప్రశాంత్ ఆటకు భయపడి చేశారంటూ కామెంట్స్ వైరలయ్యాయి.
ఇక తర్వాత ‘ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది’ అంటూ సామెతను తేజకు ఇచ్చాడు ప్రశాంత్. మ్యాటర్ ఏముండదు.. కానీ.. గొడవ మాత్రం పెద్దగా చేస్తాడు అంటూ తేజ గాలి తీసేసాడు. దీంతో నాగ్ మాట్లాడుతూ.. వర్రీ అవ్వకు తేజ.. ఆకు కూడా రుచిలో భాగమే అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక తర్వాత ‘నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది’ అనే సామెతను అశ్విని మెడలో వేసింది ప్రియాంక. ఎప్పుడు ఏం మాట్లాడుతుందో తెలియదని.. మళ్లీ నేను అలా అనలేదు.. ఇలా అన్నాను అంటూ వివరిస్తుందని రీజన్ చెప్పుకొచ్చింది. ‘ఓడ ఎక్కేవరకూ ఓడ మల్లన్న.. ఓడ దిగిన తర్వాత బోడి మల్లన్న’ అనే సామెతను భోలే మెడలో వేసింది రతిక. కానీ అందుకు సరైన రీజన్ మాత్రం చెప్పలేకపోయింది. ఇక చివరగా.. ‘పొరిగింటి పుల్ల కూరకు రుచి ఎక్కువ’ అనే సామెతను భోలే మెడలో వేస్తూ.. నాకంటే వంట బాగా చేస్తాడని రీజన్ చెప్పాడు చేజ. ఇక ఈవారం నామినేషన్లో ఉన్న వాళ్లను నిల్చోమనడంతో ప్రోమో పూర్తవుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.