Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jabardasth : జబర్దస్త్ షోకు కొత్త యాంకర్.. ఆ అందాల తార ఎవరో తెలుసా ?..

ఇప్పుడు చాలా మంది సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. కొందరు హీరోలుగా.. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఫుల్ బిజీ అయిపోయారు. జబర్దస్త్ మొదటి యాంకర్ అనసూయ.. ఆ తర్వాత ఆమె వెళ్లిపోవడంతో రష్మీని తీసుకువచ్చారు. కొన్నాళ్లకు జబర్దస్త్, ఎక్స్ర్టా జబర్దస్త్ అంటూ రెండు షోలుగా విడదీసి మరో షోకు తిరిగి అనసూయనే యాంకరింగ్ చేసింది. అయితే ఈ షో నుంచి చాలా మంది వెళ్లిపోవడం.. మళ్లీ కొత్తవాళ్లు రావడం మొదటి నుంచి జరుగుతూనే ఉంది.

Jabardasth : జబర్దస్త్ షోకు కొత్త యాంకర్.. ఆ అందాల తార ఎవరో తెలుసా ?..
Jabardasth
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 05, 2023 | 7:56 PM

జబర్దస్త్.. ఈ పేరు తెలియనివారుండరు. బుల్లితెరపై రికార్డ్ సృష్టించిన కామెడీ షో. దీనికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మొదటి నుంచి ఇప్పటివరకు బుల్లితెరపై సత్తా చాటుతుంది. ఈ షోలో ఎంతో మంది తమ కామెడీ పంచులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి తమకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఇప్పుడు చాలా మంది సినీ పరిశ్రమలో రాణిస్తున్నారు. కొందరు హీరోలుగా.. మరికొందరు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఫుల్ బిజీ అయిపోయారు. జబర్దస్త్ మొదటి యాంకర్ అనసూయ.. ఆ తర్వాత ఆమె వెళ్లిపోవడంతో రష్మీని తీసుకువచ్చారు. కొన్నాళ్లకు జబర్దస్త్, ఎక్స్ర్టా జబర్దస్త్ అంటూ రెండు షోలుగా విడదీసి మరో షోకు తిరిగి అనసూయనే యాంకరింగ్ చేసింది. అయితే ఈ షో నుంచి చాలా మంది వెళ్లిపోవడం.. మళ్లీ కొత్తవాళ్లు రావడం మొదటి నుంచి జరుగుతూనే ఉంది.

మొదట్లో జడ్జీలుగా వ్యవహరించిన రోజా, నాగబాబు ఈ షో నుంచి తప్పుకోవడం రేటింగ్ తగ్గిపోయింది. ఆ తర్వాత వారి స్థానంలో మను, ఖుష్బూ వచ్చారు. ఇక ప్రస్తుతం కృష్ణ భగవాన్, ఇంద్రజ జడ్జీలుగా అలరిస్తున్నారు. అంతకు ముందే ఈ షో నుంచి అనసూయ తప్పుకుంది. దీంతో ఆమె స్థానంలోకి సౌమ్య రావును తీసుకున్నారు. ఓవైపు రష్మీ.. మరోవైపు సౌమ్యరావు తమ యాంకరింగ్, అందచందాలతో ఎంటర్టైన్ చేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి జబర్దస్త్ షోకు కొత్త యాంకర్ వచ్చేసింది. తాజాగా విడుదలైన ప్రోమోతో కొత్త యాంకర్ ను పరిచయం చేశారు. ఇంతకీ ఆమె ఎవరు అనుకుంటున్నారా ?.. సౌమ్య రావు స్థానంలోకి వచ్చిన కొత్త యాంకర్ సిరి హన్మంత్.

మొదట్లో యూట్యూబ్ లో షార్ట్ ఫిల్మ్ చేసి మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది సిరి. ఆ తర్వాత పలు సీరియల్స్ లో ముఖ్య పాత్రలు పోషించింది. అదే సమయంలో బిగ్ బాస్ సీజన్ 5లో కంటెంస్టెంట్ గా అడుగుపెట్టింది. హౌస్ లో యూట్యూబర్ షణ్ముఖ్ తో స్నేహంతో మరింత పాపులర్ అయ్యింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న సిరి.. ఇటీవల జవాన్ సినిమాలో మెరిసింది. షారుఖ్, నయనతార కలిసి నటించిన ఈ మూవీలో సిరి సైతం ఓ పాత్రలో కనిపించింది. దీంతో పాన్ ఇండియా స్థాయిలో ఫేమ్ సంపాదించుకుంది. తాజాగా జబర్దస్త్ కామెడీ షోకు యాంకరింగ్ చేయబోతున్నట్లుగా ఈరోజు విడుదలైన ప్రోమోలో తెలుస్తోంది.

అయితే ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పటివరకు ఈ కామెడీ షోలో అలరించిన సౌమ్య రావు ఎందుకు మానేసింది ? ఎప్పుడు మానేసింది ? అసలేం జరిగిందంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. తెలుగులో శ్రీమంతుడు సీరియల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యింది సౌమ్యరావు. ఇక ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షోతో మరింత పాపులర్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఎల్ఐసి నుంచి స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌..ఫిబ్రవరి 18 నుంచి అమలు
ఎల్ఐసి నుంచి స్మార్ట్ పెన్షన్ ప్లాన్‌..ఫిబ్రవరి 18 నుంచి అమలు
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రెచ్చిపోయిన కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్..
ఛాంపియన్స్ ట్రోఫీ ముందు రెచ్చిపోయిన కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్..
అందానికే అసూయ పుట్టేనా నిన్ను చూస్తే.. మతిపోగొడుతున్న అయేషా..
అందానికే అసూయ పుట్టేనా నిన్ను చూస్తే.. మతిపోగొడుతున్న అయేషా..
'ఏఐ శత్రువు కాదు.. తెలివిగా వాడుకోవాలి' టెక్నికల్ గురూజీ సూక్తులు
'ఏఐ శత్రువు కాదు.. తెలివిగా వాడుకోవాలి' టెక్నికల్ గురూజీ సూక్తులు
విమానంలో వీటిని తీసుకెళ్తే మీకు డేంజరే..
విమానంలో వీటిని తీసుకెళ్తే మీకు డేంజరే..
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్!
తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన పోప్ ఫ్రాన్సిస్!
ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువు ఎప్పటి వరకో తెలుసా?
ఉచితంగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకునేందుకు గడువు ఎప్పటి వరకో తెలుసా?
మూడేళ్లలో మూడు బ్లాక్ బస్టర్స్.. ఈ హీరోయిన్ క్రేజ్ మాములుగా లేదు.
మూడేళ్లలో మూడు బ్లాక్ బస్టర్స్.. ఈ హీరోయిన్ క్రేజ్ మాములుగా లేదు.
ఓర్నాయనో.. గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా..?
ఓర్నాయనో.. గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా..?
జీడిపప్పు vs పీనట్స్‌.. ఏవి తింటే మంచిది?
జీడిపప్పు vs పీనట్స్‌.. ఏవి తింటే మంచిది?