Bigg Boss 7 Telugu: తేజ్ ఎలిమినేట్.. ‘నువ్వు లేకుండా ఉండలేను.. భయమేస్తుంది’.. శోభా ఏడుపు..
తేజ ఎలిమినేట్ కావడంతో శోభా షాక్ లో ఉండిపోయింది. ఇక గుడ్ బై చెప్పడానికి తేజ వచ్చినప్పుడు అతడిని చూసి భావోద్వేగానికి గురైంది. శోభా దగ్గరకు వెళ్లి తెలిసో తెలియకో నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటాను. హర్ట్ అయి ఉంటే క్షమించు అంటూ చెప్పుకొచ్చాడు తేజ. ఇక అప్పటివరకు షాక్ లో ఉన్న శోభా నా కెప్టెన్సీ చూసి పోరా అంటూ ఏడుపు మొదలుపెట్టింది. దీంతో బయటకు వెళ్లాక 24 గంటలు చూస్తాలేవే అంటూ హగ్ ఇచ్చాడు తేజ. ఫ్యామిలీ వీక్ కోసం మాత్రమే వెయిట్ చేశాను.
బిగ్‌బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం ఎలిమినేషన్ జరిగిపోయింది. ముందు నుంచి వినిపించినట్లుగానే టేస్టీ తేజ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. అయితే ఎలిమినేట్ అయిన తర్వాత అటు ఇంటిసభ్యులను కన్నీళ్లు పెట్టించాడు తేజ. నేను ముందే ఊహించానంటూనే ఏడ్చేశాడు. అందరితో నార్మల్‌గా మాట్లాడుతూనే ఎమోషనల్ అయ్యాడు తేజ. శివాజీతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇక తేజ ఎలిమినేట్ కావడంతో శోభా షాక్ లో ఉండిపోయింది. ఇక గుడ్ బై చెప్పడానికి తేజ వచ్చినప్పుడు అతడిని చూసి భావోద్వేగానికి గురైంది. శోభా దగ్గరకు వెళ్లి తెలిసో తెలియకో నిన్ను ఇబ్బంది పెట్టి ఉంటాను. హర్ట్ అయి ఉంటే క్షమించు అంటూ చెప్పుకొచ్చాడు తేజ. ఇక అప్పటివరకు షాక్ లో ఉన్న శోభా నా కెప్టెన్సీ చూసి పోరా అంటూ ఏడుపు మొదలుపెట్టింది. దీంతో బయటకు వెళ్లాక 24 గంటలు చూస్తాలేవే అంటూ హగ్ ఇచ్చాడు తేజ. ఫ్యామిలీ వీక్ కోసం మాత్రమే వెయిట్ చేశాను. అదొక్కటే బెంగ… నాకు తెలుసు నేను ఈవారం వెళ్లిపోతానని అంటూ చెప్పుకొచ్చాడు తేజ. ఇక ఇంట్లో సభ్యులకు ఒక్కొక్కరికి గుడ్ బై చెప్పి బయటకు వచ్చేశాడు.
ఇక బయటకు వచ్చిన తర్వాత స్టేజ్ మీద తన జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అ్యాడు. అయితే తేజ జర్నీ వీడియో చూస్తే అది తేజ దా… శోభా దా అనే సందేహం కలగకమానదు. ఎందుకంటే ప్రతి ఫ్రేమ్ లోనూ శోభా ఉంది. ఇక నాగార్జున మాట్లాడుతూ.. తేజ నిన్ను నేను చాలా మిస్ అవుతాను. నీతో మాట్లాడేటప్పుడు ఎంత నవ్వుకుంటానో చాలా బాగా ఎంటర్టైన్ చేశావ్ అంటూ మెచ్చుకున్నారు. ఇక ఆ తర్వాత ఒక్కొక్కరికి పదికి ఎన్ని మార్కులు వేస్తావని నాగార్జున అడిగారు. ముందుగా శోభాకు ఎన్ని మార్కులు వేస్తావ్ అని అడగ్గా.. పదికి 20 అంటూ చెప్పేశాడు. దీంతో వెంటనే శోభా మళ్లీ ఏడ్చేసింది.
ఇక ఆ తర్వాత తేజ ఇప్పటికైనా టాటూ వేయించుకంటావా శోభా పేరును అంటూ నాగ్ అడిగారు. నువ్వు చెప్పవే.. బయటకు వచ్చాక దానికి ఓకే అని చెప్పు ఇక్కడే టాటూ చేయించుకుంటా అంటూ తేజ అన్నాడు. కానీ శోభా మాత్రం ఏం మాట్లాడకుండా ఏడుస్తూనే ఉంది. ఇప్పుడే నా జర్నీ వీడియో చూశా.. అది నీదో నాదో అర్థం కాలేదు. మొత్తం నువ్వే ఉన్నావ్ అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు తేజ. ఇక అందరి గురించి మాట్లాడి తేజ వెళ్లిపోయే ముందు శోభా మళ్లీ ఏడ్చేసింది. నువ్వు లేకుండా నేను ఉండలేనురా.. ఒక్కరోజు నీతో మాట్లాడకపోతే ఉండలేకపోయాను. ఇక రోజూ ఎలా ఉండాలో అని భయమేస్తుంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో తేజ కూడా కాస్త ఎమోషనల్ అయ్యాడు. ఇక ఆ తర్వాత శోభా ఫైనల్స్ లో ఉంటావ్.. అప్పుడు చూడటానికి వస్తాను అంటూ బై చెప్పేసి వెళ్లిపోయాడు తేజ. మొత్తానికి ఇన్నాళ్లుగా హౌస్‌లో ఫ్రెండ్స్‌గా ఉన్న వీరిద్దరిలో తేజ ఎలిమినేట్ కావడంతో ఇప్పుడు శోభా ఒంటరిందైనే చెప్పాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.