Bigg Boss 7 Telugu: ‘కర్మ హిట్స్ బ్యాక్’.. తేజ ఎలిమినేషన్ పై సందీప్ వరుస పోస్టులు..
ఈవారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ముందు నుంచి అందరిని నామినేట్ చేస్తూ బయటకు పంపించినా తేజ.. ఇప్పుడు తనే బయటకు వచ్చేశాడు. మూడో వారం నుంచి మొన్నటి వరకు అతను ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. మూడో వారంలో దామిని, నాలుగో వారంలో రతిక, ఐదో వారం శుభ శ్రీ, ఆరో వారంలో నయని.. ఏడో వారంలో పూజా, ఎనిమిదో వారంలో సందీప్.. ఇలా వరుసగా తేజ్ ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు బయటకు వచ్చేశారు.

బిగ్బాస్ సీజన్ 7 తొమ్మిదో వారం ఎలిమినేషన్ జరిగిపోయినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వైరలవుతున్న పోస్టుల ప్రకారం.. ఈసారి శోభా ఖాతాలో మరోకరు బలైనట్లుగా తెలుస్తోంది. నిజానికి గత మూడు వారాలుగా ప్రతిసారి శోభాకు అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చినప్పటికీ ఆమె సేవ్ అవుతుండడం.. ఆమెకు బదులుగా మరోకరు ఎలిమినేట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈవారం టేస్టీ తేజ ఎలిమినేట్ అయినట్లుగా తెలుస్తోంది. ముందు నుంచి అందరిని నామినేట్ చేస్తూ బయటకు పంపించినా తేజ.. ఇప్పుడు తనే బయటకు వచ్చేశాడు. మూడో వారం నుంచి మొన్నటి వరకు అతను ఎవరిని నామినేట్ చేస్తే వాళ్లు హౌస్ నుంచి బయటకు వచ్చేశారు. మూడో వారంలో దామిని, నాలుగో వారంలో రతిక, ఐదో వారం శుభ శ్రీ, ఆరో వారంలో నయని.. ఏడో వారంలో పూజా, ఎనిమిదో వారంలో సందీప్.. ఇలా వరుసగా తేజ్ ఎవర్ని నామినేట్ చేస్తే వాళ్లు బయటకు వచ్చేశారు. ఇక ఇప్పుడు మాత్రం తేజ ఎలిమినేట్ అయినట్లుగా ప్రచారం జరుగుతుండడంతో సందీప్ మాస్టర్ తన ఇన్ స్టాలో వరుసగా పోస్టులు పెడుతున్నారు.
తేజ ఎలిమినేటెడ్ అంటూ ఓ మీమ్ పేజీని షేర్ చేస్తూ.. ‘అందర్ని ఎలిమినేట్ చేస్తూ తనే ఎలిమినేట్ అయ్యాడు. పాజిటివ్ వైబ్స్’ అంటూ నిన్న తన ఇన్ స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. ఇక ఇప్పుడు మరోసారి తేజ ఎలిమినేషన్ పై స్పందిస్తూ.. “కర్మ హిట్స్ బ్యాక్.. గతవారం మంచి ప్లేయర్ నీవల్ల ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు నీవంతు తేజ ” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం సందీప్ ఇన్ స్టా స్టోరీస్ నెట్టింట వైరలవుతున్నాయి. అలా ఒక్కటి కాదు.. వరుసగా తేజ ఎలిమినేషన్ గురించి తన ఇన్ స్టా స్టోరీలో పోస్టులు పెడుతున్నాడు.

View this post on Instagram
ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఎస్ జే సూర్య, రాఘవ లారెన్స్ అథిదులుగా బిగ్బాస్ వేదికపై సందడి చేశారు. జిగర్తాండ ప్రమోషన్లలో భాగంగా వీరిద్దరి విచ్చేశారు. డాన్స్ హుక్ స్టెప్ అంటూ ఒక్కో పాటలోని హుక్ స్టెప్ గెస్ చేయాలి. ఈ టాస్కులో అమర్ దీప్, ప్రశాంత్ సాంగ్ కరెక్ట్ గా గెస్ చేసినట్లుగా తెలుస్తోంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




