Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rare Photo: ఈ ఫోటోలోని సింగర్ ఎవరో తెలుసా.. జాతీయ స‌మైక్య‌త‌కు, స‌మ‌గ్ర‌త‌కు నిద‌ర్శ‌నం ఈయన..

ఆయన సినీ గీతాలు అలాపనే కాదు.. చేసిన క‌చ్చేరీలు, ప్ర‌యివేటు ఆల్బ‌మ్స్‌కి లెక్కేలేదు. పాటే ఆయ‌న జీవితం.. పాటే ఆయ‌న‌కు ప్రాణం! ఇప్ప‌టికీ పాటతో ఆయ‌న మ‌మేకం అవుతూనే ఉన్నారు. సినిమా పాట‌ల్ని బాగా త‌గ్గించుకొని.. ఆధ్యాత్మిక గీతాల‌కు, క‌చ్చేరిల‌కు ఎక్కువ స‌మ‌యం కేటాయిస్తున్నారు. కేర‌ళ‌లో పుట్టినా యావ‌త్ భార‌త దేశం.. మ‌న‌వాడే అని గ‌ర్వంగా చెప్పుకొనే స్థాయికి ఎదిగారు. ప్రస్తుతం ఆ గాయకుడికి సంబందించిన అరుదైన ఫోటో ఒకటి నెట్టింట్లో వైరల్ అవుతోంది. అందులో ఆయన తన భార్యతో కలిసి ఉన్నప్పటిది.. అది కూడా దాదాపు 30 క్రితం ఫోటో అయి ఉంటుంది. మరి ఆ సింగర్ ఎవరు? ఆ దంపతులు ఎవరో గుర్తు పట్టారా..

Rare Photo: ఈ ఫోటోలోని సింగర్ ఎవరో తెలుసా.. జాతీయ స‌మైక్య‌త‌కు, స‌మ‌గ్ర‌త‌కు నిద‌ర్శ‌నం ఈయన..
K. J. Yesudas
Follow us
Surya Kala

|

Updated on: Mar 18, 2025 | 1:02 PM

ఏసుదాసు ఉచ్ఛాశ్వనిశ్వాసలు పాటలుగా.. నిట్టూర్పులు రాగాలుగా… పెదాలు కసిపితే… ప్రాణాలు పరవశించిపోతాయి. అలాంటి శక్తి ఒక్క ఏసుదాసు పాటకే ఉందేమో కూడా అనిపిస్తుంది. ఏపాట గురించి ముందు ప్రస్థావించాలి…ప్రతీ పాట మనసుని మదిని పులకరింపచేసి..పునీతం చేసేదే…ప్రేమ గీతాలు, విర‌హ‌గీతిక‌లు, విషాద రాగాలు, భ‌క్తి భావాలు.. అన్నింటినీ రంగ‌రించి, త‌న గొంతుతో ప‌లికించ‌గ‌ల శ‌క్తి ఆయ‌న‌కే ఉంది. ఏసుదాసు భారత సినీ ప్రపంచానికి వరంలా అందిన అమృత గాయ‌కుడు.

జనవరి 10 1940లో జన్మించిన జేసు దాసు జాతీయ స‌మైక్య‌త‌కు, స‌మ‌గ్ర‌త‌కు నిద‌ర్శ‌నం. ఎందుకంటే ఆయ‌నో క్రైస్త‌వుడు. కానీ రాముడు, సాయిబాబు, అయ్య‌ప్ప స్వామి, వెంక‌టేశ్వ‌ర‌స్వామి.. ఇలా హిందూ దేవుళ్ళ పాట‌ల‌న్నీ ఆయ‌న పాడిన‌వే. మ‌రీ ముఖ్యంగా ఆ శ‌బ‌రిమ‌లేశుడి కోసం ఏసుదాసు పాడిన‌న్ని పాట‌లు మ‌రో గాయ‌కుడు పాడ‌లేదు. అయ్యప్ప పవళింపు కోసం ఆయన పాడిన హరివరాసనం పాట శబరిమలలో ఇప్పటికీ వినిపిస్తారు. వీనులవిందైన స్వరం, శ్రోతలను మంత్రముగ్ధుల్ని చేసే శైలి ఆయన ప్రత్యేకత ఇండియన్‌ మ్యూ జిక్‌ లెజెండ్‌ కె.జె.ఏసుదాసు సొంతం. భారతీయ భాషలలో పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు మిన‌హాయిస్తే మిగిలిన అన్ని భార‌తీయ భాష‌ల్లోనూ ఆయ‌న గీతాలు ఆల‌పించారు.

జేసు దాసు పథనంథిట్ట జిల్లాలోని మలపిళ్ళైకు చెందిన ఎం.కె.అబ్రహం చిన్న కుమార్తె అయిన ప్రభను వివాహం చేసుకున్నాడు. 1970 ఫిబ్రవరి 1న జేసు దాసు, ప్రభల వివాహం జరిగింది. ఈ దంపతులకు వినోద్, విజయ్, విశాల్ అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. రెండవ కుమారుడు విజయ్ యేసుదాస్.. తండ్రికి వారసుడిగా సింగర్ గా వెండి తెరపై అడుగు పెట్టాడు. తండ్రితో పాటు కొన్ని సినిమాలో పాటలు పాడాడు. జేసు దాసు కుటుంబం ప్రస్తుతం చెన్నైలో స్థిరపడింది.

ఇవి కూడా చదవండి

తండ్రి నుంచి వారసత్వంగా సంగీతాన్ని అందుకున్న జేసు దాసు లెజెండరీ చెంబై వైద్యనాథ భాగవతార్‌తో పాటు, వెచూర్‌ హరి హర సుబ్రమణ్య అయ్యర్‌ వంటి ప్రముఖుల వద్ద తన నైపుణ్యానికి మెరుగులు అద్దుకున్నారు. జేసుదాసు 21 ఏళ్ళ వయస్సులో సంగీత ప్రపంచంలో కాలుపెట్టారు. 1961, నవంబరు 14న తొలి సినిమా పాటను ఆలపించారు.

తెలుగు సినిమాకు 1964 లో బంగారుతిమ్మరాజు మూవీతో తెలుగు తెరకు పరిచయం అయిన జేసు దాసు ఇప్పటి వరకు భారతీయభాషలన్నింటిలో కలిపి 70000 పాటలు పైగా పాటలు పాడారు. ఇంగ్లీష్‌, ఫ్రెంచ్, అర‌బ్బిక్ ఇలా ప్ర‌తి పాటా ఆయ‌న గొంతులో ప‌ర‌వ‌ళ్లు తొక్కింది. గాయకుడిగా 7 జాతీయ పుర‌స్కారాలు. 40 రాష్ట్రస్థాయి అవార్డులు, మ‌రెన్నో స‌త్కారాలు. అంతే కాదు నేపథ్య గాయకుడిగా ఏసుదాసు 50 ఏళ్ళు(గోల్డెన్ జూబ్లీ) పూర్తిచేసుకున్నారు. ఏసుదాస్ నిరంతరం పాటలకు ప్రాణంపోయాల‌ని, ఆ పాట‌లు వింటూ..మ‌న ప్రాణాలు ప‌ర‌వ‌శించిపోవాల‌ని కోరుకుందాం

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి