Ritika Singh: కేక పెట్టిస్తున్న రితిక సింగ్.. కొత్త స్టిల్స్ అదిరిపోయాయిగా..
చిన్నప్పటి నుంచి కిక్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్న రితికా సింగ్ బాక్సింగ్ నేపథ్య కథతో తీసిన ‘సాలా ఖదూస్’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే సినిమా తమిళంలో ఇరుడి సుట్రు పేరుతో రీమేక్ అయ్యింది. ఇది కూడా మంచి విజయం సాధించింది.
Updated on: Mar 18, 2025 | 1:35 PM

విక్టరీ వెంకటేశ్ నటించిన గురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హీరోయిన్ రితికా సింగ్. ఈ మూవీ తర్వాత అంతగా ఆఫర్స్ రాలేదు.. తెలుగులో పెద్దగా కనిపించక పోయినా తమిళ్ లో సినిమాలు చేస్తుంది.

చిన్నప్పటి నుంచి కిక్ బాక్సింగ్ లో శిక్షణ తీసుకున్న రితికా సింగ్ బాక్సింగ్ నేపథ్య కథతో తీసిన ‘సాలా ఖదూస్’ మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇదే సినిమా తమిళంలో ఇరుడి సుట్రు పేరుతో రీమేక్ అయ్యింది. ఇది కూడా మంచి విజయం సాధించింది.

ఇప్పుడు తెలుగుతోపాటు తమిళం, మలయాళం చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటుంది. గురు సినిమా తర్వాత తర్వాత విజయ్ సేతుపతితో కలిసి ఆండవన్ కట్టలై, అలాగే రాఘవ లారెన్స్ సరసన శివలింగ సినిమాల్లో నటించింది రితిక. ఈ రెండు చిత్రాలు కూడా హిట్ గా నిలిచాయి.

గురు తర్వాత నేరుగా మరే తెలుగు సినిమాలోనూ నటించలేదు రితిక. కేవలం నీవెవ్వరో అనే సినిమాలో కనిపించింది. ఇక ఈ ముద్దుగుమ్మ చివరిగా రజనీకాంత్ వెట్టయాన్ సినిమాలో నటించింది. వెట్టయాన్ చిత్రంలో కీలకపాత్ర పోషించింది.

ఇందులో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా ఆకట్టుకుందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే.. రితిక సోషల్ మీడియలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ చేసే వర్కౌట్లకు అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతుంటారు. అలాగే కొన్ని క్రేజీ ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది ఈ వయ్యారి భామ. తాజాగా రితిక షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.