- Telugu News Photo Gallery Cinema photos Do you recognize the little girl in this photo, She is Malavika Mohanan
ఈ ఫొటోలో ఉన్న క్యూటీని గుర్తుపట్టారా.? చూస్తేనే ప్రేమలో పడిపోయే అందం ఆమెది
హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తమ ఫేవరెట్ హీరోయిన్స్ ఫోటోలను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ఉంటారు. నెటిజన్స్ కూడా ఆ హీరోయిన్ ఎవరు అనేది చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇలా పజిల్స్ సాల్వ్ చేయడం అంటే చాలా మందికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.
Updated on: Mar 18, 2025 | 1:42 PM

హీరోయిన్స్ చిన్ననాటి ఫోటోలు నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తమ ఫేవరెట్ హీరోయిన్స్ ఫోటోలను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తూ ఉంటారు. నెటిజన్స్ కూడా ఆ హీరోయిన్ ఎవరు అనేది చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఇలా పజిల్స్ సాల్వ్ చేయడం అంటే చాలా మందికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు.

ఈ క్రమంలోనే ఓ హీరోయిన్‌కు సంబందించిన చిన్ననాటి ఫోటో ఒకటి వైరల్ గా మారింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? ఆమె అందానికి ఫిదా కానీ కుర్రాడు ఉండడు. కలువల్లాంటి కళ్లు, మత్తెక్కించే నవ్వు ఆమె సొంతం.

పై ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో కాదు.. నటి మాళవిక మోహనన్. మాళవిక చిన్ననాటి ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా మాళవిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాళవిక మోహనన్ 7 ఆగస్టు 1992న ముంబైలో జన్మించింది.

ఆమె తండ్రి యుకె మోహనన్ బాలీవుడ్ చిత్రాలకు ప్రసిద్ధ సినిమాటోగ్రాఫర్. తల్లి వీణా మోహనన్. ఆమె ప్రస్తుతం తన స్వస్థలమైన కేరళ బియ్యూర్‌లో తన కుటుంబంతో నివసిస్తుంది.మాళవిక మోహనన్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఈ ముద్దుగుమ్మ 2013 సంవత్సరంలో “బట్టం బోలే” చిత్రంతో మలయాళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన పెట్టా చిత్రంలో నటించి తమిళ అభిమానుల దృష్టిని ఆకర్షించిన నటి మాళవిక మోహనన్. ఆ తర్వాత నటుడు విజయ్ సరసన లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమాలో నటించి అభిమానుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం రాజా సాబ్ సినిమాలో నటిస్తుంది ఈ చిన్నది.





























