Manchu Vishnu: వరద బాధితులకు ‘మంచు’ ఫ్యామిలీ విరాళం.. చంద్రబాబు బొమ్మ గీసి గిఫ్ట్ ఇచ్చిన విష్ణు

భారీ వర్షాలు, వరదలతో ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోయాయి. వరదల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. దీంతో బాధితులకు చేయూతనందించేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలో మోహన్‌బాబు రూ.25 లక్షలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు.

Manchu Vishnu: వరద బాధితులకు 'మంచు' ఫ్యామిలీ విరాళం.. చంద్రబాబు బొమ్మ గీసి గిఫ్ట్ ఇచ్చిన విష్ణు
Manchu Vishnu, Mohan Babu, Chndra Babu Naidu
Follow us

|

Updated on: Sep 28, 2024 | 6:43 PM

భారీ వర్షాలు, వరదలతో ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాలు అల్లాడిపోయాయి. వరదల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులై రోడ్డున పడ్డారు. దీంతో బాధితులకు చేయూతనందించేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలో మోహన్‌బాబు రూ.25 లక్షలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. తాజాగా ఆ చెక్కును ఏపీ సీఎం చంద్రబాబుకు అందజేశారు మోహన్ బాబు. తన కుమారుడు మంచు విష్ణుతో కలిసి అమరావతి వచ్చిన మోహన్ బాబు… చంద్రబాబుకు రూ.25 లక్షల చెక్కు అందజేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు మంచు విష్ణు. ఇదే సందర్భంగా తాను స్వయంగా గీసిన చంద్రబాబు చిత్రాన్ని సీఎంకు బహుమతిగా ఇచ్చినట్లు విష్ణు తెలిపాడు. అలాగే చంద్రబాబు ఆటో గ్రాఫ్ ను కూడా తీసుకున్నట్లు పేర్కొన్నాడు. ‘ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని కలిసే భాగ్యం దక్కింది. ఏపీలో వరద బాధితుల రిలీఫ్ ఫండ్ కు రూ.25 లక్షల చెక్ అందించాం. కన్నప్ప చిత్ర విశేషాలతో పాటు, ఇంకా అనేక సంగతులు చంద్రబాబు గారితో మాట్లాడాం. నేను గీసిన ఆయన బొమ్మపై ఆటోగ్రాఫ్ కూడా ఇచ్చారు. చంద్రబాబు గారికి మరింత శక్తి లభించాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు మంచు విష్ణు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నాడు. ఇది తన డ్రీమ్ ప్రాజెక్టు అని ఇది వరకే చెప్పుకొచ్చాడు మంచు వారబ్బాయి. హాభారతం సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్‌ సింగ్‌ ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. మోహన్ బాబు, ఆర్. శరత్ కుమార్,మధుబాల, బ్రహ్మానందం, రఘుబాబు, ప్రీతి ముకుందన్, శివ బాలాజీ, కౌశల్, సురేఖా వాణి, సప్తగిరి, ఐశ్వర్య తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. సుమారు రూ. 100 కోట్లకు పైగా బడ్జెట్ తో మోహన్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సీఎం చంద్ర బాబుతో మంచు మోహన్ బాబు, విష్ణు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.