Mogalirekulu: ఆ కారణంగానే సీరియల్స్ మానేశా.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు..

ఇందులో హీరోగా నటించిన ఆర్కే నాయుడుకి హీరో రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆర్కే నాయుడు, మున్నా పాత్రలలో సాగర్ నటనతో కట్టిపడేశాడు. ఇప్పటికీ ఆర్కే నాయుడికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్కే నాయుడి పాత్రలో కనిపించిన సాగర్ కు ఇప్పటికీ ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. మొగలి రేకులు సీరియల్ తర్వాత సాగర్ మరో సీరియల్ చేయలేదు.

Mogalirekulu: ఆ కారణంగానే సీరియల్స్ మానేశా.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు..
Rk Naidu
Follow us

|

Updated on: Apr 30, 2024 | 10:11 AM

ఒకప్పుడు బుల్లితెరపై సంచలనం సృష్టించిన సీరియల్ మొగలిరేకులు. కేవలం ఫ్యామిలీ అడియన్స్ మాత్రమే కాకుండా యూత్ సైతం ఈ సీరియల్‏కు ఫ్యాన్స్. ఎలాంటి సాగదీత లేకుండా ట్విస్టులు.. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా సాగింది ఈ సీరియల్. ప్రతి ప్రేక్షకుడిని ఆకట్టుకునే విధంగా ఈ సీరియల్ స్టోరీ డిజైన్ చేశారు మంజుల నాయుడు. అలాగే ఈ సీరియల్లో నటించిన ప్రతి ఒక్కరికి మంచి గుర్తింపు వచ్చింది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల దాకా ఈ సీరియల్ నటీనటులకు అభిమానులుగా మారిపోయారు. ఇందులో హీరోగా నటించిన ఆర్కే నాయుడుకి హీరో రేంజ్ ఫాలోయింగ్ వచ్చేసింది. ఆర్కే నాయుడు, మున్నా పాత్రలలో సాగర్ నటనతో కట్టిపడేశాడు. ఇప్పటికీ ఆర్కే నాయుడికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఆర్కే నాయుడి పాత్రలో కనిపించిన సాగర్ కు ఇప్పటికీ ఫాలోయింగ్ ఎక్కువే ఉంది. మొగలి రేకులు సీరియల్ తర్వాత సాగర్ మరో సీరియల్ చేయలేదు.

అప్పట్లో ప్రభాస్ నటించిన మిస్టర్ పర్ఫెక్ట్ మూవీలో చిన్న పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత హీరోగా చిన్మ చిన్న చిత్రాలు చేయడం స్టా్ర్ట్ చేశాడు. కానీ ఏం జరిగిందో తెలియదు.. ఉన్నట్లుండి అటు సినిమాలకు దూరమయ్యాడు. దీంతో ఆర్కే నాయుడు సీరియల్స్ ఎందుకు చేయడం లేదు ? అనే సందేహాలు చాలా మందిలో వ్యక్తమయ్యాయి. అలాగే కొన్నాళ్లు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నాడు. ఇక చాలా కాలం తర్వాత ఇప్పుడు 100 సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇందులోనూ మళ్లీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న సాగర్.. తాను ఎందుకు సీరియల్స్ చేయలేదో వెల్లడించారు.

సాగర్ మాట్లాడుతూ.. “మొగలిరేకులు సీరియల్.. అందులో ఆర్కే నాయుడు పాత్ర బాగా క్లిక్ అయ్యింది. అందరికీ ఆ సీరియల్ బాగా నచ్చింది. సీరియల్స్ అంటేనే ఫిమేల్ సెంట్రిక్ గా సాగుతాయి. కానీ మొగలిరేకులు కథ నా చుట్టూ తిరిగిందగి. ఆ పాత్రకు ఇచ్చిన రేంజ్ తర్వాత చేస్తే అదే రేంజ్ లో సక్సెస్ అయ్యే పాత్రలు చేయాలి అనుకున్నారు. మొగలిరేకులు తర్వాత చాలా సీరియల్ ఆఫర్స్ వచ్చాయి. కానీ నాకు పేరు తెచ్చిన ఆర్కే నాయుడు పాత్రను మించి ఏ పాత్ర రాలేదు. అందుకే సీరియల్స్ చేయలేదు” అని చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.