Waltair Veerayya: మెగా ఫ్యాన్స్‌ గెట్ రెడీ.. రిలీజ్ డేట్ వచ్చేసింది.. వాల్తేరు వీరయ్య వేటమొదలయ్యేది అప్పుడే..

ఇటీవలే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఫ్యాన్స్ కు ఆ హిట్ సరిపోలేదు. పైగా గాడ్ ఫాదర్ సినిమా రీమేక్ అవ్వడంతో అంతగా ఫ్యాన్స్ కు ఎక్కలేదు.

Waltair Veerayya: మెగా ఫ్యాన్స్‌ గెట్ రెడీ.. రిలీజ్ డేట్ వచ్చేసింది.. వాల్తేరు వీరయ్య వేటమొదలయ్యేది అప్పుడే..
Megastar Chiranjeevi
Follow us

|

Updated on: Dec 07, 2022 | 5:50 PM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ వాల్తేరు వీరయ్య. ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎందురుచూస్తున్నారు. ఇటీవలే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ ఫ్యాన్స్ కు ఆ హిట్ సరిపోలేదు. పైగా గాడ్ ఫాదర్ సినిమా రీమేక్ అవ్వడంతో అంతగా ఫ్యాన్స్ కు ఎక్కలేదు. ఇక ఇప్పుడు ఫుల్ మాస్ మసాలా మూవీతో రాబోతున్నారు చిరు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక వాల్తేరు వీరయ్య సినిమా నుంచి వచ్చిన బాస్ పార్టీ లిరికల్ వీడియోకు వచ్చిన రెస్పాన్స్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికి  ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది.

ఇదిలా తాజాగా ఈ సినిమా నుంచి అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది. వాల్తేరు వీరయ్య సినిమాను మొదటి నుంచి సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని చెప్తూ వస్తున్నారు మేకర్స్. అనుకున్నట్టుగానే ఈ సినిమాను జనవరి 13న రిలీజ్ చేయనున్నారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్లో చిరు మాస్ లుక్ లో కనిపించారు.

ఇవి కూడా చదవండి

సముద్రం మధ్యలో బోట్ పై వేటకు వెళ్తున్న పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ ఫ్యాన్స్ కు పూనకాలు తెప్పించేలా ఉంది. ఇక ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఈ మూవీలో మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలో కనిపించనున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ సంగీతం అందిస్తున్న వాల్తేరు వీరయ్యలో మెగాస్టార్ కు జోడీగా శ్రుతిహాసన్ కనిపించనుంది.

Waltair Veerayya

Waltair Veerayya

మరిన్ని ఎంటర్టైన్మెంట్ న్యూస్ కోసం..

మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో