AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bandla Ganesh: భక్తుడి కోరిక నెరవేరేదెప్పుడు?.. బండ్ల గణేశ్‌తో మూవీకి పవన్ ఓకే చెప్పేదెప్పుడు?

Pawan Kalyan - Bandla Ganesh: తెల్లారినప్పటి నుంచి పడుకునే వరకు నా దేవుడు.. నా దేవుడు అంటూ పవన్ కళ్యాణ్‌ను ప్రసన్నం చేసుకోడానికి బండ్ల గణేష్ నానా తంటాలు పడుతుంటారు. ఆ దేవుడే ఈ భక్తుడికి ప్రతీసారి బిస్కెట్ ఇస్తున్నారు.

Bandla Ganesh: భక్తుడి కోరిక నెరవేరేదెప్పుడు?.. బండ్ల గణేశ్‌తో మూవీకి పవన్ ఓకే చెప్పేదెప్పుడు?
Bandla Ganesh, Pawan Kalyan (File Photos)Image Credit source: TV9 Telugu
Janardhan Veluru
|

Updated on: Dec 07, 2022 | 1:18 PM

Share

తెల్లారినప్పటి నుంచి పడుకునే వరకు నా దేవుడు.. నా దేవుడు అంటూ పవన్ కళ్యాణ్‌ను ప్రసన్నం చేసుకోడానికి బండ్ల గణేష్ నానా తంటాలు పడుతుంటారు. ఆ దేవుడే ఈ భక్తుడికి ప్రతీసారి బిస్కెట్ ఇస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా తన డేట్స్ కోసం చూస్తున్న బండ్లకు కాకుండా.. మిగిలిన నిర్మాతలకు డేట్స్ ఇస్తున్నారు పవర్ స్టార్. మరి దేవుడే పట్టించుకోని ఈ భక్తుడిని మిగిలిన హీరోలు పట్టించుకుంటారా..? అని ఇండస్ట్రీ వర్గాల్లో ఇంట్రెస్టింగ్ టాక్ నడుస్తోంది.  ఎక్కడెక్కడో ఉన్న నిర్మాతలందరికీ డేట్స్ ఇస్తున్న పవర్ స్టార్.. తన భక్తుడికి మాత్రం హ్యాండిస్తున్నారు. నీ దేవుడు ఎవరంటే.. మరో ఆలోచన లేకుండా పవన్ కళ్యాణ్ పేరే చెప్పే ఈ భక్తుడికి ఆ దేవుడే వరసగా షాకులిస్తున్నారు.

కొన్నేళ్లుగా పవన్ కళ్యాణ్‌తో సినిమా నిర్మించాలని వేచి చూస్తున్నారు బండ్ల. దానికోసం ఆయనెప్పుడెప్పుడు డేట్స్ ఇస్తారా అని కళ్లు కాయలు కాచేలా వెయిట్ చేస్తున్నారు. కానీ పవన్ మాత్రం బండ్లకు తప్ప అందరికీ సినిమాలు చేస్తున్నారు. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్‌, ఏఎం రత్నం, రామ్ తళ్ళూరికి డేట్స్ ఇచ్చిన పవన్.. తాజాగా డివివి దానయ్య నిర్మాణంలో సుజీత్ సినిమా ప్రకటించారు. దాంతో బండ్లకు మళ్ళీ నిరాశ తప్పలేదు.

పవన్ కొత్త సినిమా అనౌన్స్ చేసిన ప్రతీసారి.. తన వంతు వస్తుందేమో అని ఆశగా చూస్తున్నారు బండ్ల. కానీ ఆ టైమ్ మాత్రం రావట్లేదు. నమ్ముకున్న దేవుడే వరాలివ్వకుండా పెడచెవిన పెడుతుంటే.. ఇక ఈ భక్తుడిని మిగిలిన హీరోలు పట్టించుకుంటారా..? వరాలు ఇచ్చే గుడికి వెళ్దాం.. దాంతో పాటు ప్రసాదం కూడా తిందాం.. లేకపోతే టైం వేస్ట్ అంటూ బండ్ల గణేష్ పెట్టిన పోస్ట్.. పవన్‌పై అసంతృప్తితోనే అని అర్థమవుతుంది. మొత్తానికి ఈ భక్తుడిని ఆ దేవుడెప్పుడు కరుణిస్తాడో..? చూడాలిక..

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తలు చదవండి