Krishna: నటశేఖరుడికి పార్లమెంట్ ఘననివాళి.. సూపర్ స్టార్ కృష్ణకు సేవలను కొనియాడిన లోక్‌సభ స్పీకర్..
తెలుగు సినిమారంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కృష్ణ మృతికి సంతాప సూచికంగా లోక్‌సభ రెండు నిముషాల పాటు మౌనం పాటించింది.
మాజీ ఎంపీ , సూపర్‌స్టాక్ కృష్ణకు పార్లమెంట్ ఘననివాళి అర్పించింది. నటుడిగా , పార్లమెంట్ సభ్యుడిగా కృష్ణ ఎన్నో దశాబ్దాల పాటు ప్రజా సేవ చేశారని కొనియాడారు లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా. తెలుగు సినిమారంగంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కృష్ణ మృతికి సంతాప సూచికంగా లోక్‌సభ రెండు నిముషాల పాటు మౌనం పాటించింది. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్ యాదవ్‌కు కూడా సభ ఘన నివాళి అర్పించింది. ఘట్టమనేని కుటుంబంలో ఈ ఏడాది తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సంవత్సరం ప్రారంభంలో కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు మరణించగా.. సెప్టెంబర్ నెలలో ఆయన భార్య ఇందిరా దేవి కన్నుమూశారు. సతీమణి మరణించిన తర్వాత కృష్ణ కుంగిపోయారని.. అదే సయమంలో గుండెపోటు రావడంతో ఆయనను కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్పించారు. ఐసీయూలో చికిత్స పొందిన కృష్ణ ఈ నెల 15న తెల్లవారుజామున 4.09 గంటలకు తుదిశ్వాస విడిచారు.
కృష్ణ మరణంతో ఘట్టమనేని కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. వరుసగా అన్నయ్య.. తల్లి.. తండ్రి మరణాలతో మహేష్ కన్నీరు మున్నీరయ్యారు.కృష్ణ మరణం తర్వాత సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. “నీ జీవితం వేడుకగా గడచిపోయింది. నీ నిష్క్రమణం కూడా అంతే వేడుకగా సాగింది. అదే మీ గొప్పతనం. మీరు మీ జీవితాన్ని నిర్భయంగా గడిపారు. ధైర్యం, సాహసం మీ స్వభావం.. మీ వెలుగు నాలో ఎప్పటికీ ప్రకాశిస్తూనే ఉంటుంది.
విచిత్రమేమిటంటే, నేను ఇంతకు ముందెన్నడూ లేని శక్తిని నాలో అనుభవిస్తున్నాను.. ఇప్పుడు నేను నిర్భయంగా ఉన్నాను.. అచ్చం మీలాగే.. నీ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తాను.. నిన్ను మరింత గర్వపడేలా చేస్తాను… లవ్ యూ నాన్నా… మై సూపర్ స్టార్ అంటూ ట్వీట్ చేశారు మహేష్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.