AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SS Thaman: రేంజ్‌కి తగ్గట్టే రూటు మార్చిన థమన్.. త్రివిక్రమ్ మూవీ కోసం కొత్త ప్రయత్నం

Music Director S Thaman: థమన్.. సౌత్ సినిమాలో ఈ పేరు ఇప్పుడు ఓ సంచలనం. దేవీ శ్రీ ప్రసాద్ ఉన్నా కూడా.. ఆయనతో పోటీ పడుతూ రెండు మూడేళ్లుగా థమన్ టాప్ ఫామ్‌లో కొనసాగుతున్నారు.

SS Thaman: రేంజ్‌కి తగ్గట్టే రూటు మార్చిన థమన్.. త్రివిక్రమ్ మూవీ కోసం కొత్త ప్రయత్నం
Music Director S Thaman (File Photo)
Janardhan Veluru
|

Updated on: Dec 07, 2022 | 12:58 PM

Share

థమన్.. సౌత్ సినిమాలో ఈ పేరు ఇప్పుడు ఓ సంచలనం. దేవీ శ్రీ ప్రసాద్ ఉన్నా కూడా.. ఆయనతో పోటీ పడుతూ రెండు మూడేళ్లుగా థమన్ టాప్ ఫామ్‌లో కొనసాగుతున్నారు. పైగా స్టార్ హీరోలు, దర్శకులు అంతా థమన్ కావాలంటూ భీష్మించుకు కూర్చుంటున్నారు. ఒక్కసారి ఆయనతో పని చేస్తే.. వరసగా అవకాశాలు ఇచ్చేస్తున్నారు. అందుబాటులో ఉండటం ఓ కారణమైతే.. రెమ్యునరేషన్ కాస్త తక్కువగా ఉండటం మరో రీజన్. థమన్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే మొన్నటి వరకు అయితే చెన్నై.. లేదంటే హైదరబాద్‌లో ఉండేవి. అందరికీ అందుబాటులో ఉండేవాడు కాబట్టే ఈయనే కావాలంటున్నారు అంతా. కానీ ఇప్పుడు థమన్ వర్కింగ్ స్టైల్ కూడా మారిపోయింది. తన రేంజ్‌కు తగ్గ పనులే చేస్తున్నారు థమన్. మ్యూజిక్ సిట్టింగ్స్ కోసం దేశం దాటిపోతున్నారాయన.

అలా అందరివాడు అనిపించుకుంటున్న థమన్ ఇప్పుడు కాస్ట్ లీ అయిపోతున్నారు. ఒక్కో సినిమాకు ఈయన తీసుకునే రెమ్యునరేషన్ రేంజ్ బాగా పెరిగిపోయిందని ప్రచారం జరుగుతుంది. ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలకు దేవీశ్రీ ప్రసాద్ కంటే ఎక్కువే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్కన బెడితే.. ఆయన బిజీ కారణంగా దర్శక నిర్మాతలు ఇబ్బంది పడుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.

అటు సినిమా సినిమాకు స్టైల్ మారుస్తూ తన రేంజ్ పెంచుకుంటున్నారు థమన్. హీరోలతో సమానంగా లిరికల్ సాంగ్స్‌లో ఈయనే కనిపిస్తున్నారు. తన టీంపైనే సాంగ్ ఉండేలా చూసుకుంటున్నారు థమన్. ఒకప్పుడు చెన్నై, హైదరాబాద్ తప్ప మరో చోట మ్యూజిక్ సిట్టింగ్స్ తెలియని థమన్.. తాజాగా మహేష్ బాబు కోసం ఏకంగా దుబాయ్ వెళ్లిపోయారు. అరవింద సమేత, అల వైకుంఠపురములో తర్వాత థమన్, త్రివిక్రమ్ కలిసి చేస్తున్న సినిమా ఇది.

ఇవి కూడా చదవండి

విదేశాల్లో మ్యూజిక్ సిట్టింగ్స్ అంటే దానికి అయ్యే ఖర్చు భారీగానే ఉంటుంది. అయినా నిర్మాతలు కూడా థమన్‌నే ఎంకరేజ్ చేస్తున్నారట. ఎందుకంటే వర్క్ స్పీడ్‌గా అయిపోతుందన్న కారణంతో.. హైదరాబాద్ వచ్చారంటే మిగిలిన సినిమాలతో బిజీ అయిపోతారని.. త్రివిక్రమ్ కావాలనే థమన్‌ను దుబాయ్‌కి తీసుకెళ్లారని తెలుస్తోంది. అక్కడుంటే తక్కువ రోజుల్లో ఎక్కువ ఔట్ పుట్ వస్తుంది. మొత్తానికి పెరుగుతున్న సినిమాల సంఖ్యతో పాటు థమన్ కూడా కాస్ట్ లీ అయిపోతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు చదవండి..