AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Unstoppable 2: అన్‏స్టాపబుల్‏లో ప్రభాస్.. ప్రాణ స్నేహితుడితో కలిసి రచ్చ చేయనున్న డార్లింగ్..

ఇప్పటివరకు టాప్ సెలబ్రెటీలు వచ్చి రచ్చ చేయడంతో అన్‌స్టాపబుల్ 2కి రెస్పాన్స్ అదిరిపోతుంది కానీ ఎక్కడో అభిమానుల్లో మాత్రం ఓ అసంతృప్తి అలాగే ఉండిపోయింది. సీజన్ 1లో స్టార్ హీరోలే ఎక్కువగా గెస్టులుగా వచ్చారు..

Unstoppable 2: అన్‏స్టాపబుల్‏లో ప్రభాస్.. ప్రాణ స్నేహితుడితో కలిసి రచ్చ చేయనున్న డార్లింగ్..
Prabhas, Balakrishna
Rajitha Chanti
|

Updated on: Dec 07, 2022 | 12:05 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్ గా వ్యహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ 2కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షోకు రోజూ రోజుకీ మరింత క్రేజ్ పెరుగుతుంది. ఇప్పటివరకు చాలా మంది సెలబ్రెటీలు బాలయ్యతో కలిసి సందడి చేశారు. ఇక ఈ సీజన్ 2లో సినీ, రాజకీయ ప్రముఖులు విచ్చేసి బాలయ్యతో ముచ్చటించారు. ఇటీవల డిసెంబర్ 2న ప్రసారమైన ఎపిసోడ్ లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు.. నిర్మాతలు అల్లు అరవింద్, సురేష్ బాబు విచ్చేసి.. సినిమాల గురించి మాత్రమే కాకుండా.. వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. అయితే ఇప్పటివరకు టాప్ సెలబ్రెటీలు వచ్చి రచ్చ చేయడంతో అన్‌స్టాపబుల్ 2కి రెస్పాన్స్ అదిరిపోతుంది కానీ ఎక్కడో అభిమానుల్లో మాత్రం ఓ అసంతృప్తి అలాగే ఉండిపోయింది. సీజన్ 1లో స్టార్ హీరోలే ఎక్కువగా గెస్టులుగా వచ్చారు.. కానీ సెకండ్ సీజన్ మాత్రం పొలిటికల్ మసాలా ఎక్కువైపోయిందని ఫీల్ అవుతున్నారు సినిమా ఫ్యాన్స్. అలాంటి వాళ్ళ కోసమే పాన్ ఇండియా హీరోను పట్టుకొస్తున్నారు బాలయ్య. మరి ఎవరా హీరో.. ఎప్పుడు రాబోతుంది ఆ ఎపిసోడ్..? తెలుసుకుందామా.

తాజాగా ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఈషోకు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాబోతున్నాడట. ఒంటరిగా కాదు.. తన ప్రాణ స్నేహితుడైన హీరో గోపీచంద్ కలిసి రాబోతున్నాడట. ఈ ఎపిసోడ్ షూటింగ్ ఈనెల 11న ప్రారంభంకాబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వర్షం సినిమాతో గోపిచంద్ ప్రతినాయకుడిగా నటించారు. ఈ మూవీ తర్వాత కూడా వీరి ఫ్రెండ్ షిప్ కొనసాగింది. డార్లింగ్ తో తనకున్న అనుబంధం గురించి ఇప్పటికే పలు సందర్భాలో చెప్పుకొచ్చారు గోపిచంద్. ఇక ఇప్పుడు వీరిద్దరు కలిసి బాలయ్య షోలో రచ్చ చేయనున్నారట. వీరికి సంబంధించిన ఎపిసోడ్ న్యూయర్ కానుకగా స్ట్రీమింగ్ చేయనున్నారని సమాచారం.

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఓవైపు డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా.. మరోవైపు.. సలార్, ప్రాజెక్ట్ కె చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక డార్లింగ్ ఫ్యాన్స్ ఆశలన్నీ కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ చిత్రంపైనే ఉన్నాయి. ఇందులో డార్లింగ్ సరసన శ్రుతి హాసన్ నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
SRH vs RR Result: రాజస్థాన్‌ను చిత్తు చేసిన హైదరాబాద్..
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో రామ్ పోతినేని
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
వీరింట లక్ష్మీదేవి ఉండదు.. గరుడ పురాణం చెబుతున్న పచ్చి నిజాలివే!
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
సీలింగ్ ఫ్యాన్ vs టేబుల్ ఫ్యాన్.. మీ ఇంటికి ఏ ఫ్యాన్ కరెక్ట్?
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
శుక్రుడి మార్పుతో ఈ రాశుల వారికి లక్ష్మీ కటాక్షం..
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
1,W,0,W,0,W.. రాజస్థాన్‌ను వణికించిన సన్‌రైజర్స్ నయా ‘స్పీడ్ గన్
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
ఆరోగ్యానికి మంచిదని తీసుకునే ఈ ఆహారాల్లోనూ ఉప్పు ఎక్కువగా ఉంటుందట
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
మూడింట ఒక వంతు సీట్లు చట్టసభల్లో మహిళలకు దక్కుతాయా?
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్
OTTలో ట్రెండ్ అవుతోన్నతెలుగు క్రైమ్ థ్రిల్లర్..IMDBలో 8.3 రేటింగ్