AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మురుగునీటి కాలువ కోసం తవ్వుతుండగా జాక్‌పాట్.. రాత్రికి రాత్రే కోట్లాధిపతి!

మురుగునీటి కాలువ కోసం తవ్వకాలు చేపడుతుండగా భారీ బంగారు నిధి బయటపడింది. ఓ పాత భవనం పునాదుల కింద 49 బంగారు కడ్డీలతో పాటు బకెట్‌ నిండా బంగారు నాణేలు లభించాయి. ఈ నిధి విలువ సుమారు రూ.90 కోట్లు ఉంటుందని అంచనా. తొలుత నాణేలను సాధారణ 1 యూరో నాణేలుగా భావించిన కార్మికులు, అవి బంగారమని తెలిసి ఆశ్చర్యపోయారు..

మురుగునీటి కాలువ కోసం తవ్వుతుండగా జాక్‌పాట్.. రాత్రికి రాత్రే కోట్లాధిపతి!
Belgium Gold Treasure Discovery
Srilakshmi C
|

Updated on: Aug 18, 2026 | 12:46 PM

Share

మురుగునీటి కాలువ నిర్మాణం కోసం తవ్వకాలు చేపడుతుండగా భారీ బంగారు నిధి బయటపడిన ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది. డెండర్మొండోలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. తవ్వకాల్లో లభించిన బంగారం విలువ సుమారు రూ.90 కోట్లు ఉంటుందని సమాచారం. బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌కు సుమారు 18 మైళ్ల ఉత్తరాన ఉన్న డెండర్మొండోలో మురుగునీటి కాలువ పైపులు వేసేందుకు కార్మికులు ఓ పాత భవనం పునాదులను తొలగిస్తున్నారు. ఈ క్రమంలో వారికి భారీగా బంగారు కడ్డీలు, బంగారు నాణేలు కనిపించాయి.

పాత భవనం పునాదిలో నిధి

తవ్వకాల్లో బయటపడిన నాణేలను చూసిన కార్మికులు తొలుత అవి 1 యూరో నాణేలు అయి ఉంటాయని భావించారు. అయితే వాటిని పరిశీలించిన తర్వాత అవి బంగారు నాణేలు అని తేలింది. దీంతో అధికారులు అప్రమత్తమై తవ్వకాలను పరిశీలించారు. ఈ నిధిలో ఏకంగా 49 బంగారు కడ్డీలు, ఒక బకెట్‌ నిండా బంగారు నాణేలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మొత్తం నిధి విలువ సుమారు రూ.90 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. బంగారం లభించిన పాత భవనం బెల్జియంలోని ఓ చారిటీ సంస్థకు చెందినదిగా అధికారులు తెలిపారు. భవనం పునాదుల కింద ఇంత భారీగా బంగారు నిధి ఎలా చేరిందన్న విషయం ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈ నిధికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ నిథి ఎవరికి దక్కుతుంది?

బెల్జియం చట్టాల ప్రకారం.. తవ్వకాల్లో లభించిన ఇలాంటి నిధిని దాని సంబంధిత యజమానికి అప్పగించే నిబంధనలు ఉన్నాయి. నిధి బయటపడిన తేదీ నుంచి ఐదేళ్లలోపు యజమాని దానిని క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే ఐదేళ్ల వ్యవధిలో ఎవరూ ఈ నిధిపై హక్కు కోరుకోకపోతే, దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకునే అవకాశం ఉంటుంది. మురుగునీటి కాలువ కోసం సాధారణంగా చేపట్టిన తవ్వకాల్లో ఇంత భారీ మొత్తంలో బంగారం బయటపడటం స్థానికంగా తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ బంగారు నిధికి అసలు యజమాని ఎవరు, ఇంతకాలం అది అక్కడ ఎందుకు దాచిపెట్టారనే విషయాలపై ఇప్పుడు అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us
అందుకే ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌కు నో చెప్పా..!
అందుకే ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ సాంగ్‌కు నో చెప్పా..!
స్మార్ట్‌ఫోన్లు కొనే వారికి షాకింగ్‌ న్యూస్‌.. జేబుకు చిల్లులే..!
స్మార్ట్‌ఫోన్లు కొనే వారికి షాకింగ్‌ న్యూస్‌.. జేబుకు చిల్లులే..!
షూటింగ్‌లో సరికొత్త రికార్డు.. స్వర్ణం అందించిన కైనన్-నీరూ జోడీ
షూటింగ్‌లో సరికొత్త రికార్డు.. స్వర్ణం అందించిన కైనన్-నీరూ జోడీ
'డబ్బుల వర్షం' పేరుతో మాయాజాలం!
'డబ్బుల వర్షం' పేరుతో మాయాజాలం!
తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు.. డబ్బంతా పోయింది..!
తండ్రిని చిన్న వయసులోనే కోల్పోయాడు.. డబ్బంతా పోయింది..!
ఫిట్‌గా ఉండడం ఇంత ఈజీనా.. కోహ్లీ ఫాలో చేసే ఆ సీక్రెట్ ఏంటో తెలుసా
ఫిట్‌గా ఉండడం ఇంత ఈజీనా.. కోహ్లీ ఫాలో చేసే ఆ సీక్రెట్ ఏంటో తెలుసా
సూపర్ ఎల్‌నినోతో దక్షిణ భారత్‌కు భారీ ముప్పు..!
సూపర్ ఎల్‌నినోతో దక్షిణ భారత్‌కు భారీ ముప్పు..!
పితృ పక్షంలో ఏ వస్తువులు దానం చేయకూడదు? ఏవి దానం చేస్తే శుభప్రదం?
పితృ పక్షంలో ఏ వస్తువులు దానం చేయకూడదు? ఏవి దానం చేస్తే శుభప్రదం?
కేవలం ఒక సెంట్‌ స్థలంలో రూ. 4 లక్షల బడ్జెట్‌లోనే ఇల్లు నిర్మాణం..
కేవలం ఒక సెంట్‌ స్థలంలో రూ. 4 లక్షల బడ్జెట్‌లోనే ఇల్లు నిర్మాణం..
పొట్టకూటికోసం ఆటో నడిపాడు.. ఇప్పుడు తెలుగులో తోపు నటుడు
పొట్టకూటికోసం ఆటో నడిపాడు.. ఇప్పుడు తెలుగులో తోపు నటుడు