Mobile: మొబైల్ నెంబర్‌లో 10 అంకెలే ఎందుకుంటాయి.? అయ్య బాబోయ్.. అసలు కథ తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
ప్రతీ ఒక్కరి చేతుల్లో ఇప్పుడు మొబైల్ ఫోన్ అనేది తప్పనిసరిగా ఉంటుంది. మీరు చూస్తే మీ మొబైల్ నెంబర్ 10 అంకెలు మాత్రమే ఉంటుంది. అయితే 10 అంకెలు మాత్రమే ఎందుకుండాలి? అనే ప్రశ్న ప్రతీఒక్కరికి ఉంటుంది. అయితే దీని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఒకసారి చూద్దాం.

మొబైల్ ఫోన్ లేనివారంటూ ఎవరూ ఉండరు. ఇప్పటి రోజుల్లో కమ్యూనికేషన్, ఇతర అవసరాలకు ఫోన్‌తో ప్రతీఒక్కరికీ అవసరం ఉంటుంది. ఫోన్ కలిగి ఉన్న ప్రతీఒక్కరూ సిమ్ కార్డు కూడా కలిగి ఉంటారు. మీరు సిమ్ కార్డు నెంబర్ చేస్తే భారత్‌లో కేవలం 10 అంకెలు మాత్రమే ఉంటుంది. దీంతో 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉంటుందనే ప్రశ్న అందరికి కలుగుతుంది. 8 లేదా 9 అంకెలు ఎందుకు ఉండకూడదు..? 10 అంకెలు మాత్రమే ఎందుకు ఉండాలి? అనే డౌట్ ఉంటుంది. అయితే మొబైల్ నెంబర్ 10 అంకెలతో ఉండటం వెనుక చాలా లెక్కలే ఉన్నాయట. దేశ అవసరాలు, భవిష్యత్ ప్రణాళిక దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారట.
10 అంకెల వెనుక అసలు కారణం
భారతదేశంలో జనాభా ఎక్కువ. ఇప్పుడు దేశ జనాభా 140 కోట్లు దాటింది. చాలామంది ఒకటి కంటే ఎక్కువ సిమ్‌లను ఉపయోగిస్తూ ఉంటారు. 9 అంకెలు ఉంటే 100 కోట్ల నెంబర్లు మాత్రమే సాధ్యమవుతాయి. దేశ జనాభాతో పోలిస్తే ఇది సరిపోదు. అంటే 10 అంకెల నెంబరింగ్ సిస్టమ్ ఉంటే వెయ్యి కోట్ల కాంబినేషన్ నెంబర్లను జారీ చేయడానికి సాధ్య పడుతుంది. దీంతో దేశ జనాభా, భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక 11 నెంబర్లను ప్రవేశపెడితే 10 వేల కోట్ల నెంబర్లను రూపొందించవచ్చు. కానీ ప్రస్తుతం ఆ అవసరం లేదనే ఉద్దేశంతో 10 అంకెల నెంబర్ల సిస్టమ్‌ను ఫిక్స్ చేశారు. దీని వెనుక ఉన్న అసలు కథ ఇదేనని చెప్పవచ్చు.
10 అంకెల మొబైల్ నెంబర్ ఎవరు నిర్ణయించారు..?
10 అంకెల మొబైల్ నెంబర్ ఉండాలని భారత టెలికాం నియంత్రణ సంస్థ(ట్రాయ్) నిర్ణయించింది. నేషనల్ నెంబరింగ్ ప్లాన్ 2003 కింద ఈ సిస్టమ్‌ను అమల్లోకి తెచ్చింది. టెలికాం రంగానికి సంబంధించిన ఏ నిర్ణయమైన ట్రాయ్ చేతుల్లోనే ఉంది. దీంతో ట్రాయ్‌ను ఈ నెంబర్ సిస్టమ్‌ను నిర్ణయించింది. గతంలో ల్యాండ్ లైన్ నెంబర్లు 6 లేదా 7 అంకెలతో ఉండేవి. కానీ 2000 తర్వాత దేశంలో మొబైల్ వాడకం పెరిగిపోవడంతో పాత విధానాన్ని పక్కన పెట్టారు. 6 లేదా 7 అంకెలు మాత్రమే ఉండటం వల్ల ఎక్కువ విభిన్న నెంబర్లను జారీా చేయలేరు. దీంతో 10 అంకెలు ఉండాలని ఫిక్స్ చేశారు. అప్పటినుంచి అదే సిస్టమ్ కొనసాగుతోంది. 10 అంకెల మొబైల్ నెంబర్‌లో మొదటి 4 లేదా 5 అంకెలు మీ రాష్ట్రం, ప్రాంతాన్ని, టెలికాం కంపెనీని ప్రతిబింబిస్తాయి. ఇక మిగతా నెంబర్లు వినియోగదారుడి వ్యక్తిగత గుర్తింపు సంఖ్యను సూచిస్తాయి. ప్రతీ దేశం తమ దేశ జనాభాను బట్టి మొబైల్ నెంబర్‌లో ఎన్ని అంకెలు ఉండాలనేది నిర్ణయించుకుంటారు.
