AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నీ ఆకలి తీరాక ఆ మాట చెప్పకూడదు.. అది చీటింగ్..! ఆ జబర్దస్త్ నటుడిపై ఫైర్ అయిన హైపర్ ఆది

జబర్దస్త్ ద్వారా పాపులర్ అయిన వారిలో హైపర్ ఆది ఒకడు. తన కామెడీతో ప్రేక్షుకులను విశేషంగా ఆకట్టుకున్నాడు హైపర్ ఆది. ఎన్నో వదల స్కిట్స్ లో నవ్వులు పూయించాడు హైపర్ ఆది. అలాగే సినిమాల్లోనూ ఛాన్స్ లు అందుకున్నాడు. ఇప్పుడు టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ రాణిస్తున్నాడు.

నీ ఆకలి తీరాక ఆ మాట చెప్పకూడదు.. అది చీటింగ్..! ఆ జబర్దస్త్ నటుడిపై ఫైర్ అయిన హైపర్ ఆది
Hyper Aadi
Rajeev Rayala
|

Updated on: Aug 18, 2026 | 11:29 AM

Share

జబర్దస్త్ కామెడీ షో ద్వారా పాపులర్ అయిన వారిలో కిరాక్ ఆర్పీ ఒకరు. ఒకప్పుడు నవ్వులు పూయించిన కిరాక్ ఆర్పీ ఆతర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. నెల్లూరు చేపల పులుసు పేరుతో బిజినస్ మొదలుపెట్టాడు. ఆతర్వాత పలు వివాదాల్లో నిలిచారు. కాగా గతంలో ఆయన జబర్దస్త్ పై చేసిన కామెంట్స్ అప్పట్లో సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జబర్దస్త్ కార్యక్రమ సెట్‌లో అందించే ఫుడ్ పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. కిరాక్ ఆర్పీ జబర్దస్త్‌లో తాను ఎదుర్కొన్న ఆహార సమస్యల గురించి చెప్తూ..  జబర్దస్త్ సెట్‌లో ఆహారం నాణ్యత అత్యంత దారుణంగా ఉండేది. “మధ్యాహ్నం అన్నం మిగిలితే సాయంత్రం పులిహోర చేస్తారు. అన్నం ఉడకకుండా ఉంచేది పులిహోర కోసమేమో అనిపిస్తుంది” అని ఆయన తీవ్రంగా విమర్శించారు. టీ క్వాలిటీ కూడా అధ్వాన్నంగా ఉంటుందని, సాధారణంగా ఎవరూ తాగడానికి ఇష్టపడరని పేర్కొన్నాడు. దీనివల్ల సైకిల్ పై పెట్టే టిఫిన్‌ను జబర్దస్త్ కంటెస్టెంట్లు, టీమ్ లీడర్లు సైతం తినడానికి ఎగబడేవారని, అది తమకు చిన్నతనంగా అనిపించిందని కిరాక్ ఆర్పీ చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి :

ఆ హీరోతో ఒక పాటలోనైనా కలిసి డ్యాన్స్ చేయాలి.. అదే నా కోరిక : ఇంద్రజ

ఇది కేవలం ఒక కారణం కాదని, ఇలాంటి అనేక కారణాల వల్లనే కొందరు జబర్దస్త్ మానేయాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చాడు. ఆహారం విషయంలో ప్రొడక్షన్ హౌస్‌లు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కిరాక్  చెప్పుకొచ్చాడు. ప్రొడక్షన్ అనేది 24 క్రాఫ్ట్స్‌లో ఒక భాగమని, కెమెరా, సెట్ ఆర్ట్ లాగే మంచి ఆహారం అందించడం కూడా ఒక రూల్ అని ఆయన అన్నాడు. కేజీఎఫ్‌లో బానిసలను చూసినట్లు ఉంటుంది ఆర్పీ అన్నాడు. ఉడకలేదని, చికెన్ నాణ్యత బాగోలేదని అడిగితే, చికెన్‌నే తీసివేశారని, గుడ్డు పెట్టలేదని అడిగితే, దానితో గుడ్డు కూడా తీసివేశారని ఆయన ఆరోపించాడు. కార్మికులను కుక్కల్లా చూస్తున్నారని కిరాక్  ఆర్పీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇది కూడా చదవండి :

చిరంజీవికి విలన్‌గా చేయడమే నాజీవితంలో అతి పెద్ద కోరిక.. నటుడి ఎమోషనల్ కామెంట్స్

ఈ ఆరోపణలపై హైపర్ ఆది స్పందిస్తూ.. “నువ్వు ఆకలితో ఉన్నప్పుడు ఈ మాట చెప్తే అది జెన్యూన్, నీ ఆకలి తీరాక ఆ మాట చెప్తే అది చీటింగ్” అని బదులిచ్చాడు. అన్నదానం చేసే వారి దగ్గరికి వెళ్లి బిర్యానీ పెట్టమని అడగడం ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. అన్నం చల్లారడం, కూరలో ఉప్పు తక్కువ అవ్వడం వంటివి జరగొచ్చని, అంతేకానీ పాచిపోయిన ఆహారం పెట్టరని ఆయన అన్నాడు. బయట సైకిల్ బండి వద్ద టిఫిన్ తినడం అనేది వ్యక్తిగత ఇష్టమని, తాను కూడా రోడ్డు మీద టిఫిన్ ఇష్టపడతానని, సరదాగా వెళ్ళి తింటానని హైపర్ ఆది వివరించాడు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :

ఇన్నాళ్ల తర్వాత కనిపించింది మావ..! బిందాస్ బ్యూటీ ఎంత మారిపోయింది .!!

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us